నేడు విశాఖ శారదాపీఠ శిష్య సన్యాస దీక్షా మహోత్సవం

నేడు విశాఖ శారదాపీఠ శిష్య సన్యాస దీక్షా మహోత్సవం

శారదాపీఠ ఉత్తరాధికారి శిష్య సన్యాసాశ్రమ స్వీకార మహోత్సవాలు ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. కృష్ణానది తీరంలో ఉండవల్లి కరకట్ట పక్కన శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 3 రోజులుపాటు ఉదయం 8.30 నుంచి రాత్రి 8గంటల వరకూ కార్యక్రమాలుంటాయని నిర్వహకులు తెలిపారు. విశాఖ శారదాపీఠానికి ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మను నియమించనున్నారు. పీఠం భావి బాధ్యతలను ఆయనకు అప్పగించనున్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధు, సంతులు విచ్చేస్తున్నారు. చివరి రోజున తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ, తెలంగాణ, ఒడిశా ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌, నవీన్‌ పట్నాయక్‌ హాజరవనున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *