కోహ్లీ ఇంకా పరిణితి చెందాలి...:అఫ్రీదీ

కోహ్లీ ఇంకా పరిణితి చెందాలి...:అఫ్రీదీ

ప్రపంచ క్రికెట్‌ అంతా ఇప్పుడు కోహ్లీ వైపే చూస్తోంది. అతడు రికార్డులన్నీ దాటుకుంటూ వెళ్తుంటే… చప్పట్లు కొడుతోంది. సీనియర్‌ క్రికెటర్లంతా కోహ్లీని గొప్ప ఆటగాళ్ల సరసన చేర్చేస్తున్నారు. తన రికార్డులని బద్దలుకొట్టగలవాడు కోహ్లీనే అని సచిన్‌ కూడా కితాబిచ్చాడు. ఇలా ప్రతిఒక్కరూ కోహ్లీ గురించి మాట్లాడుతూ, ఆ అతడి ఆటతీరును కీర్తిస్తూనే ఉన్నారు. కానీ ఒక విషయంలో మాత్రం కోహ్లీ మెరుగుపడాలని అఫ్రీదీ అభిప్రాయపడ్డాడు.

Virat Kohli Afridhi

సారథిగా ఇంకా ఎదగాలి…

మంచి బ్యాట్స్‌మన్‌గా రికార్డులను తిరగరాస్తూ, రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న కోహ్లీ కెప్టెన్‌గా ఇంకా చాలా ఎదగాల్సి ఉందనీ, పరిణితి చెందాల్సి ఉందనీ పాకిస్థాన్‌ హార్డ్‌ హిట్టర్‌ షాహిద్‌ అఫ్రీదీ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తాను అభిమానించే ఆటగాళ్లతో కోహ్లీ ఒకడనీ, మైదానంలో గొప్పగా కనిపిస్తాడనీ, కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు అలా చూస్తుండిపోతాననీ, ఫీల్డింగ్‌ లోనూ చురుకుగా ఉంటాడనీ అన్నాడు. అయితే సారథిగా కోహ్లీ పరిణితి చెందాల్సిన విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నాడు. ఆసీస్‌ గడ్డపై కంగారూలను ఓడించగల సత్తా కోహ్లీ సేనకు ఉందనీ, దానికి పూర్తిస్థాయి ప్రదర్శన కావాలనీ అఫ్రీదీ అభిప్రాయపడ్డాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *