కోహ్లీపై విమర్శల వర్షం ...

కోహ్లీపై విమర్శల వర్షం ...

ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, కోట్లల్లో అభిమానులు ఉన్నా… నోరు అదుపులో పెట్టుకోవాలి. దాని కంటే ముందుగా, అంత మంది అభిమానాన్ని మూటకట్టుకున్న వ్యక్తి ఆలోచనా తీరు ఆదర్శనియంగా ఉండాలి. ప్రగతిశీలంగా ఉండాలి. లేదంటే వాళ్లు ఎంతటి వారైనా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవే కాకుండా వారిని అభిమానిస్తున్న కోట్లాది మంది అదే మార్గాన్నీ, ఆలోచనా తీరునూ అనుసరించే ప్రమాదమూ ఉంది. తన సంకుచిత ఆలోచనా విధానంతో టీం ఇండియా సారథి కోహ్లీ చిక్కుల్లో పడ్డాడు.

virat kohli app

విమర్శల వర్షం…

విరాట్‌ కోహ్లీ… ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో గట్టిగా వినిపిస్తున్న పేరు. సునాయాసంగా సెంచెరీల మీద సెంచెరీలు బాదేస్తున్నాడు. రోజురోజుకూ అభిమానుల చిట్టా పెరిగిపోతోంది. టీం ఇండియా అంటే కోహ్లీ, కోహ్లీ అంటే టీం ఇండియా అనే స్థాయి వరకూ వచ్చేశాడు. ఇప్పటి వరకూ ఉన్న రికార్డులన్నింటినీ ఉఫ్‌ అని ఊది పారేయగట ఈజ్‌ను కనబరుస్తున్నాడు. అంత స్థాయిలో ఉండీ… తన కురచ ఆలోచనా విధానాన్ని బయటపెట్టుకుని, విమర్శల పాలవుతున్నాడు. కోహ్లీ ఇలాంటి వాడా… అని అందరూ షాక్‌ అవుతున్నారు. పరుగుల వర్షం కురిపించే కోహ్లీపై విమర్శల వర్షం కురుస్తోంది.

అభిమానిపై విరుచుకుపడ్డాడు…

నవంబర్‌ 5న 30వ పుట్టినరోజు సందర్భంగా తన పేరుతోనే కోహ్లీ ఒక యాప్‌ను ప్రారంభించాడు. దాని ప్రమోషన్‌లో భాగంగా ఒక వీడియోను అప్‌లోడ్‌ చేశాడు. దానిపై ఎంతో మంది అభిమానులు స్పందించారు. వారిలో ఒక అభిమాని “ప్రస్తుతమున్న భారత ఆటగాళ్ల కంటే… ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లనే ఎక్కువ ఇష్టపడతాను. కోహ్లీ ఆటలో ఎలాంటి ప్రత్యేకతా లేదు. రావాల్సిన దాని కంటే ఎక్కువ గుర్తింపు వచ్చింది” అని కామెటంట్ చేశాడు. ఈ కామెంట్‌పై కోహ్లీ నెగిటివ్‌గా స్పందించి, ఆ అభిమానిపై విరుచుకుపడ్డాడు.

దేశం వదిలిపొమ్మన్నాడు…

ఆ కామెంట్‌తో విరాట్‌కు విపరీతమైన కోపం వచ్చినట్టుంది. ” నీకు ఆ దేశాల మీదే ప్రేమ ఉన్నట్టుంది. నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు. ఈ దేశం విడిచి వెళ్లిపో” అని సమాధానం ఇచ్చాడు. అంతటితో ఆగలేదు. ” నన్ను అభిమానించక పోవడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇండియాలో ఉంటూ ఇండియా ప్లేయర్లనే విమర్శించడం మంచిది కాదు” అని కూడా అన్నాడు. ఈ కామెంట్లపై విమర్శల వర్షం కురుస్తోంది. ఎంచక్కా… విదేశీ ప్రకటనలు ఇస్తూ, జేబులు నింపుకుంటున్న కోహ్లీ అంటూ… నానా రకాలుగా నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *