నంబర్‌వన్‌ టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ

నంబర్‌వన్‌ టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ

టాప్‌ ర్యాంక్‌ కోహ్లీ కెరీర్‌లో ఇదే తొలిసారి

టీమిండియా కెప్టెన్, రన్‌ మిషన్‌ విరాట్ కోహ్లీ టాప్‌ ఫామ్‌ తో నంబర్‌వన్‌ టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ టాప్ ర్యాంకులో నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టన్‌ స్టీవ్ స్మిత్ నంబర్‌వన్ రికార్డును దాటేసి టాప్‌ పోజిషన్‌ కు చేరాడు. ఇంగ్లాండ్‌తో టీమిండియా తొలి టెస్టులో ఓడిపోయినా.. విరాట్‌ కోహ్లీ సూపర్‌ ఇన్నింగ్స్‌ తో అందరిని ఆకట్టుకున్నాడు. టెస్టుల్లో నంబర్‌వన్‌ స్థానానికి చేరుకోవడం కోహ్లీ కెరీర్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం. టెస్టు క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ తర్వాత అగ్రస్థానాన్ని దక్కించుకున్న ఏడో ఇండియన్‌ క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.

టాప్‌ ర్యాంక్‌ కు చేరిన ఏడో ఇండియన్‌ క్రికెటర్‌గా కోహ్లీ

virat kohli

ఎడ్జ్‌బాస్టన్‌ లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీతో చెలరేగి రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 200 రన్స్‌ సాధించిన కోహ్లీ.. 31 పాయింట్లను సాధించి స్మిత్‌పై 5 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గత 32 నెలల్లో టెస్టు క్రికెట్‌లో టాప్ ర్యాంకు లో ఉన్న స్మిత్‌ను దాటేసి కోహ్లీ రికార్డు తిరగరాశాడు. గతంలో టెస్టు క్రికెట్‌లో నంబర్‌వన్ ర్యాంకులో నిలిచిన మిగతా భారత బ్యాట్స్‌మన్లలో సచిన్‌ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్‌, గౌతమ్ గంభీర్‌, సునీల్‌ గవాస్కర్‌, వీరేందర్ సెహ్వాగ్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ఉన్నారు.

ఆడిన 67 టెస్టుల్లో 14వ స్థానంలో నిలిచిన కోహ్లీ.. ఆల్‌టైం ట్యాలీ 934 పాయింట్లతో గవాస్కర్‌కు ముందున్నాడు. టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్‌ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. స్పిన్ బౌలర్లు రవీంద్ర జడేజా మూడు, అశ్విన్‌ ఐదో స్థానాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం స్మిత్ కంటే ఐదు పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. తన ర్యాంకును నిలుపుకోవాలంటే సిరీస్ మొత్తం తన ఫామ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *