ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై గ్రామస్థుల దాడి

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై గ్రామస్థుల దాడి

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై గ్రామస్థులు కర్రలతో దాడి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలోని నైరలో జరిగింది. ఇసుకను లారీల్లో అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన గ్రామస్థులు కర్రలతో వారిపై దాడికి దిగారు. విచక్షణ రహితంగా కొట్టారు. దాడిలో వీఆర్వోలు చంద్రశేఖర్‌, విశ్వేశ్వరరావులు గాయపడగా, వీఆర్వోలు చంద్రభూషణరావు, అప్పలనాయుడు, వీఆర్‌ఏ శ్రీరాములు తప్పించుకున్నారు. గ్రామస్థుల చేతిలో గాయపడిన వీఆర్వోలను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత వీఆర్వోల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *