అటవీశాఖ సిబ్బందిపై కర్రలతో దాడి

అటవీశాఖ సిబ్బందిపై కర్రలతో దాడి

కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కోనెరు కృష్ణ రెచ్చిపోయారు. ఆయన అనుచరులతో కలిసి అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్‌, సిబ్బందిపై దాడికి దిగారు. అటవీశాఖ అధికారులు కాగజ్‌నగర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ పని జరుగుతున్న ప్రాంతానికి వచ్చి అటవీకరణ పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులు, కృష్ణ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన కృష్ణ, ఆయన అనుచరులు రేంజ్ ఆఫీసర్ అనితతో పాటు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అనితిపై కర్రలో దాడి చేశారు. దీంతో అనితతోపాటు సిబ్బందికి తీవ్ర గాయాలైయ్యాయి. ఈ ఘటనపై అటవీ అధికారులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *