టీడీపీ Vs జనసేన.. బెజవాడలో ఫ్లెక్సీ వార్

టీడీపీ Vs జనసేన.. బెజవాడలో ఫ్లెక్సీ వార్

రాష్ట్రంలో టీడీపీ ,జ‌న‌సేన‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముద‌రి పాకాన ప‌డుతోంది. టీడీపీ టార్గెట్ గా జ‌న‌సేన మందుకు పోతోంది. దీనిలో భాగంగానే తాజాగా విజ‌య వాడ‌లో ఫ్లెక్సీల కలకలం రేగుతోంది.

రెండు పార్టీల మ‌ధ్య ప్లెక్సీల గొడ‌వ

రెండు పార్టీల మ‌ధ్య ప్లెక్సీల గొడ‌వ మొద‌లైంది. టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జనసేన పార్టీ పోస్టర్లు విజయవాడ నగరంలో దర్శనమిచ్చాయి.టీడీపీ నేత కాట్రగడ్డ బాబు, పవన్ ను విమర్శిస్తూ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తీవ్ర వివాదమైంది. దీనికి కౌంటర్ గా జనసేన నేత రాజేష్ ఆధ్వర్యంలో బెజవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పచ్చ తమ్ముళ్ల పిచ్చ పురాణం, వెంటాడుతున్న ఓటమి భయం అంటూ ఫ్లెక్సీలో రాశారు. టీడీపీని ఓడించే జన సైనికులం అంటూ ఘాటు మాటల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

తీవ్ర వివాదం గా మారిన ఫ్లెక్సీ

మరోవైపు అన్నదమ్ములు కలిసి ప్రజారాజ్యం పేరుతో పోటీ చేసినా 18 సీట్లే వచ్చాయనీ, ఇప్పుడు కొత్తగా ప్రగల్భాలు పలకడం మానుకోవాలని చురకలు అంటించారు.టీడీపీ ఫ్లెక్సీల‌కు ధీటుగా జ‌న‌సేన కూడా ప్లెక్సీల‌ను ఏర్పాటు చేసింది. టీడీపీ నేతలు, ప్రభుత్వం లక్ష్యంగా జనసేన పేరుతో తీవ్ర విమర్శలు గుప్పించారు.గుర్తుకు వస్తోందా పదేళ్ల ప్రతిపక్ష కాలం. 2009లో విజయవాడలో జీరోగా ఉన్న మీరు 2014కల్లా హీరోగా ఎలా మారారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురింపించారు.విజయవాడలో విజయం సాధించడం మీ నాయకుడి తంత్ర ఫలమా? లేక మా నాయకుడి కాళ్లు మొక్కిన ఫలమా..? అని తీవ్రంగా మండిపడ్డారు. ఓటమి భయంతోనే ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు..

టీడీపీని ఓడించే జన సైనికులం

ఈ నేపథ్యంలో టీడీపీ పోస్టర్లకు కౌంటర్ గా జనసేన నేతలు కొత్త పోస్టర్లు, ప్లెక్సీలను అంటించారు. కాగా, ఈ వ్యవహారం చేయి దాటకుండా ఉండేందుకు ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వాలని నగర పోలీసులు భావిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *