విజ‌య‌శాంతి రీ ఎంట్రీ..సూప‌ర్ స్టార్ సినిమాలో నటించనున్న రాముల‌మ్మ..

విజ‌య‌శాంతి రీ ఎంట్రీ..సూప‌ర్ స్టార్ సినిమాలో నటించనున్న రాముల‌మ్మ..

తెలుగు ఇండస్ట్రీలో విజయశాంతి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇండియన్ సినిమాకు కూడా తానేంటో చూపించుకుంది ఈ సీనియర్ హీరోయిన్. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి సంచలనం సృష్టించిన విజయశాంతి..ఒకప్పుడు హీరోలతో సమానంగా ,హీరోలకంటే కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంది . విజయశాంతి ఫస్ట్ మూవీ 1979లో వచ్చిన తమిల్ మూవీ కల్లుక్కుళ్ ఈర. తెలుగులో యాక్ట్ చేసిన మొదటి సినిమా కిలాడీ కృష్ణుడు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన ఈమూవీలో నటిగా విజయశాంతికి మంచి మార్కులే పడ్డాయి.కెరీర్ మొదట్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేసిన విజయశాంతికి నటిగా మంచి గుర్తింపు ఇచ్చిన సినిమా నేటి భారతం. ఈ మూవీ విజయశాంతికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాతో నటిగా వెనుదిరిగి చూసుకోలేదు. ఒకవైపు ఫర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తునే, మరోవైపు గ్లామర్ పాత్రల్లో నటించి ఆడియన్స్ చేత విశ్వ నట భారతిగా పిలిపించుకుంది. విజయశాంతి కెరీర్‌లో మైల్ స్టోన్ చిత్రంగా నిలిచిన చిత్రం ఒసేయ్ రాములమ్మ. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమాగాను ఉత్తమనటిగా నంది అవార్డు అందుకుంది.ఈ సినిమాలో విజయశాంతి పోషించిన రాములమ్మ పాత్ర చాలా పాపులర్ అయ్యింది. ప్రేక్షకులు ఆమెను ముద్దుగా రాములమ్మ గా పిలవడం ప్రారంభించారు. 30 ఏళ్ల కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన విజయశాంతి ఒసేయ్ రాములమ్మ తరువాత కొన్ని సినిమాలు చేసింది. ఆ తరువాత రాజకీయాల్లో బిజీకావడంతో 12 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. మరి ఈ రీ ఎంట్రీ మూవీతో విజయశాంతి సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటుందో లేదో చూడాలి ఈ లేడి బాస్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *