బడ్జెట్ వల్ల వొరిగిందేమీ లేదు...విమర్శించిన విజయసాయిరెడ్డి!

బడ్జెట్ వల్ల వొరిగిందేమీ లేదు...విమర్శించిన విజయసాయిరెడ్డి!

ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో రెండవసారి ఘనవిజయం సాధించిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. నాలుగు దశాబ్దాల తర్వాత మన దేశానికి ఒక మహిళా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే…విభజన కారణంగా లోటు బడ్జెట్‌తో ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు లాభించే ఏ నిర్ణయం లేకపోవడం విచారకరం. ఆంధ్రప్రదేశ్ కోడలు అయ్యుండి కూడా ఏపీకి తగిన న్యాయం చేయలేదని రాజకీయ నాయకులు చెబుతున్నారు. గత ఐదేళ్లుగా ఏపీకి మొండిచేయి చూపించిన కేంద్రం ఈసారైనా తగిన న్యాయం చేస్తుందని ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది.

ప్రత్యేకహోదా ఏది!?

ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక విద్యకు ఏ మాత్రం సహకారం అందించలేదు. ఆర్థికలోటుతో కిందామీద పడుతున్న ఏపీ పట్ల కేంద్ర మళ్లీ నిరాస పరిచింది. ప్రస్తుతానికి ఏపీలోని సెంట్రల్ వర్సిటీ కోసం రూ.13 కోట్లు, ఏపీ ట్రైబల్‌ వర్సిటీ కోసం రూ. 8కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేసింది. అయితే ఏపీలోని ఐఐటీ, ఐఐఎం, నిట్‌, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ ఐటీలకు మాత్రం ఒక్క నయాపైసా కూడా బడ్జెట్‌లో కేటాయించలేదు. దీంతో వాటి నిర్వహణ భారం మొత్తం ఏపీ ప్రభుత్వంపై పడుతుంది.కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వై్ఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థిక బడ్జెట్ తీవ్రంగా నిరాశ పరిచిందని చెప్పారు. పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన ఆయన ” కేంద్రం ఆర్థిక మంత్రి కనీసం ప్రత్యేక హోదా ప్రస్తావన కూడా తేకపోవడం విచారకరం అని అన్నారు.

మాట నిలబెట్టుకోలేని కేంద్రం…

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలపై ఒక్క మాటైనా మాట్లాడలేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచేయి చూపించిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌ వల్ల మన రాష్ట్రానికి వొరిగింది ఏమీ లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎంతమేరకు నిధులు కేటాయిస్తున్నారో దానిపై స్పష్టత లేదని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఏపీ రెవెన్యూ లోటు రూ.60 వేల కోట్ల వరకు పెరిగింది… కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుందని, రాష్ట్రానికి తప్పకుండా సహాయం చేస్తామని కేంద్రం కూడా ఇదివరకు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని పెదవి విరిచారు. పోలవరం, అమరావతిపై కూడా నిధుల ప్రస్తావన లేదన్నారు. ఏపీ ప్రయోజనాలను కాపాడటం కోసం ఏ పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంటులో ఖచ్చితంగా ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *