రావయ్యా...మాల్యా! త్వరలో భారత్‌కు

రావయ్యా...మాల్యా! త్వరలో భారత్‌కు
ప్రజల సొమ్ముని బ్యాంకుల ద్వారా అప్పు రూపంలో తీసుకుని దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా…ఇంతకాలం తర్వాత భారత్‌కు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాంకుల ద్వారా దాదాపు రూ. 9 వేల కోత్లు తీసుకుని వెళ్లిపోయిన మాల్యాను రప్పించడానికి భారత్ విపరీతంగా కృషి చేస్తోంది. దీనికి సంబంధించి బ్రిటన్ హోమ్ మంత్రి సాజిద్ జావీద్ ఆదివారం తీర్పు తర్వాత సంబందిత పత్రాలపై సంతకం చేశారు. ఈ నిర్ణయం గురించి హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి ఫిబ్రవరి 4 నుంచి 14 రోజుల వరకు మాల్యాకు సమయం ఉంది. ఒకవేళ హైకోర్టు గనక మాల్యా అపీలును తిరస్కరిస్తే వెంటనే భారత్‌కు తిరిగి రావాల్సి ఉంటుంది.

సంతకం అయిపోయింది

గత సంవత్సరం డిసెంబర్ 10న మాల్యా భారత్‌లో కోర్టు కేసును ఎదుర్కోవాల్సి ఉందంటూ లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు హోమ్‌శాఖకు చేరింది. మంత్రుల్లో అత్యంత సీనియర్ అయినటువంటి సాజిద్ జావీద్…మాల్యాను భారత్‌కు అప్పగించేలా నిర్ణయం తీసుకుంటూ ఆదివారం సంతకం చేశారు.
vijay mallya extradition news
ప్రస్తుత అక్కడి అంచనా ప్రకారం…కేసులో ఉన్న అంశాలు, పరిస్థితులను గమనిస్తే హైకోర్టు తీర్పు మాల్యాకు వ్యతిరేకంగానే ఉండేలా ఉందని చెబుతున్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు నష్టాలు రావడం కారణంగానే అప్పులు తీర్చలేకపోయానంటూ గతంలో మాల్యా లండన్ కోర్టులో వాదించాడు. కానీ…బ్యాంకుల నుంచి అప్పు రూపంలో వచ్చిన డబ్బును అసలైన అవసరానికి కాకుండా వేరే అవసరాలకు వాడుకున్నట్టు ప్రాథమిక ఆధారాలున్నట్టు కోర్టు గతంలోనే గుర్తించింది. ఇక ఆదివారం బ్రిటన్ తీర్పు పట్ల భారత ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *