‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ

‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ

వరుస హిట్స్‌తో స్పీడ్‌గా దూసుకెళ్తున్న సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండకు నోటా మూవీ సడెన్ బ్రేక్ వేసింది….దీంతో  టాక్సీవాలా సినిమాపై ఆశలు పెట్టుకొని  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే రిలీజ్‌కు ముందే నెట్లో లీకైన ఈ సినిమా   హిట్ అవుతుందో లేదో అని టెస్షన్ పడ్డారు చిత్రటీమ్.  అంతేకాదు రెండు  మూడు సార్లు వాయిదా పడిని ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ మూవీ రివ్యూలో చూద్దాం…

taxiwala review

టాక్సీలో ఆత్మ…

ఈ మూవీ కథ విషయానికి వస్తే  శివ ఐదేళ్లలో డిగ్రీ కంప్లీట్ చేసి ఇండిపెండెంట్ గా బతుకుదామని తన  ప్రెండ్ హెల్ప్‌తో చిన్న చిన్న జాబ్స్ ట్రై చేస్తుంటాడు. అయితే  అవి సెట్ కావని భావించి  ఇంట్లో డబ్బులు తీసుకొని ఒక క్యాబ్ కొనుక్కొని టాక్సీ డ్రైవర్‌గా  లైఫ్ స్టార్ట్ చేస్తాడు .టాక్సీ ఫస్ట్ ట్రిప్ లోనే హీరోయిన్ అను  ప్రేమలో పడతాడు.  ఇక లైఫ్ సెటిల్ అవుతుందని అనుకుంటున్నా టైంలో ఆ టాక్సీలో ఆత్మ ఉందని తెలుస్తోంది. ఇంతకి ఆ టాక్సీలోకి ఆత్మ  ఎలా వచ్చింది..? ఆత్మ బరి నుంచి బయట పడేందుకు  శివ ఏం చేశాడు? అసలు టాక్సీకి ఆత్మకు  మధ్య ఉన్న సంబంధం ఎంటీ అనేదే స్టోరీ…

taxiwala review

విజయ్ నటన సూపర్బ్…

విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే  తన యాక్టింగ్‌తో  మెస్మరైజ్ చేశాడు. కొన్ని సీన్స్‌లో విజయ్ నటన సింప్లీ సూపర్బ్ అని  చేప్పాలి. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి   హీరోయిన్‌గా పరిచయమైన  ప్రియాంక  గ్లామర్‌లో  పాత్రలో ఆకట్టుకుంది. అయితే ఆమె క్యారెక్టర్‌కు దర్శకుడు అంత ఇంపార్టెన్స్‌ ఇవ్వకపోవడంతో నటనకు అంతగా స్కోప్‌ లేదు.. శశిర పాత్రలో నటించిన  మళవిక నాయర్  ఉన్న కొద్దిసేపు అయినా కూడా  బాగానే  నటించింది.మిగత పాత్రల్లో నటించిన నటి నటుటు తమ పరిదిమేరకు నటించి మెప్పించారు.

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో…

ఈ సినిమా దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్‌ సూపర్ నాచురల్ మరియు సైంటిఫిక్ ఎలిమెంట్స్‌ని  ప్రధాన అంశంగా తీసుకొని దానికి కామెడీ జోడించి కథని రాసుకున్నాడు.. అయితే కథ కొత్తగానే ఉన్న  స్ర్కీన్ ప్లే  రాసుకోవడంలో కాస్త తడబడిన్నట్టు కనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ గా. సెకండ్ హాఫ్ అంతా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగిపోతున్న ఈమూవీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చేసరికి అనుకున్నంత రేంజ్‌లో లేదు. ఈసినిమాకు  నేపథ్య సంగీతం హైలైట్ అని చెప్పోచ్చు.  నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తనికి నోటా మూవీతో డిజప్పాయింట్ అయిన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు.

 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *