టాలీవుడ్ హిమేష్ రేష్మియాలా మారిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్ హిమేష్ రేష్మియాలా మారిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఓవర్ నైట్‌లో యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్న ఈ హీరో బాలీవుడ్ రోమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీని ఫాలో అవుతున్నాడు… మాటలతోనే కాదు చేతల్లోనే అతన్ని మించిపోయాల ఉన్నాడు. ఇంతకీ విజయ్ ఇమ్రాన్ హష్మీని ఏ విషయంలో ఫాలో అవుతన్నాడో తెలియాలంటే మీరు ఈ స్టోరీ ఫాలో అవ్వండి…

vijay devarakonda

ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటు స్టార్ హీరో లిస్ట్‌లో చేరిపోయాడు. అయితే ఇప్పటి వరకు ఈ హీరో నటించిన సినిమాల్లో లిప్‌లాక్ సీన్స్ కామన్‌ అయిపోయింది. బాలీవుడ్ రోమాంటిక్ హీరో ఇమ్మాన్ హష్మిని మించేలా ముద్దులతో వెండితెరను వేడేక్కిస్తున్నాడు విజయ్. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, నోటా, టాక్సీవాలా సినిమాల్లో ముద్దు సీన్స్ హద్దు దాటాయి. ఇప్పుడు ఈ హీరో నటిస్తోన్న డియర్ కామ్రేడ్ సినిమా టీజర్‌లోనే ముద్దు రుచి చూపించాడు. ఇక సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటుందో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇక క్రాంతిమాధవ్ డైరెక్షన్‌లో చేస్తున్న ఓ సినిమాలో విజయ్‌తో నాలుగురు హీరోయిన్ప్‌తో రోమాన్స్ చేయబోతున్నాడు. అందులో రాశీఖన్నాతో ముద్దు సీన్ సినిమా మొత్తానికి టాప్‌గా నిలుస్తోందట. విజయ్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ క్రాంతిమాధవ్ లాంగ్ లిప్‌లాక్ సీన్ డిజైన్ చేశాడని సమాచారం..ఈ ముద్దు సీనే ఈ సినిమాకు కీలకంగా మారబోతుందట. అయితే కథ డిమాండ్ చేయడంతో ఈ ముద్దు సీన్‌కు విజయ్, రాశీఖన్నా సై అన్నారట. ఇప్పటి వరకు ముద్దులంటే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ గుర్తొచ్చేవాడు. సౌత్‌లో ముద్దులతో ముంచెత్తిన హీరో ఎవరు అంతగా లేరు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ముద్దులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడని అంటున్నారు ఈ హీరో అభిమానులు..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *