డాక్టర్ పాత్రలో నటిస్తున్న విజయ్ దేవరకొండ

డాక్టర్ పాత్రలో నటిస్తున్న విజయ్ దేవరకొండ

ఒక సినిమాతో విజయ్ దేవరకొండ లైఫ్ స్టైయిలే మారిపోయింది. పెళ్లి చూపులు సినిమాతో తన యాక్టింగ్‌ని ఫ్రూవ్ చేసుకున్నా ఈ హీరో.. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో జీవించేశాడు.. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమాతో విజయ్ క్రేజీ హీరో అయ్యాడు. దీంతో వరుస సినిమాలు చేస్తున్న విజయ్ గీతగోవిందం సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. ఇటీవలే వచ్చిన టాక్సీవాలాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నా ఈ హీరోతో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలు క్యూ కడుతున్నారు.

vijay devarakonda rashmika 2nd movie

క్రికెటర్ పాత్రలో నటిస్తోన్న రష్మిక

వరుస సినిమాలతో రెండు మూడేళ్ళు డైరీ ఫుల్ చేసుకున్న ఈ రౌడీ హీరో ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. భరత్ కమ్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ డాక్టర్ పాత్రలో నటిస్తున్నడట. ఓ లక్ష్యం కోసం పోరాడే యువకుడి పాత్రలో విజయ్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.ఇందులో విజయ్‌కి జోడీ రష్మిక మండన్న క్రికెటర్ పాత్రలో కనిపించనుందట… మరోసారి ఈ జంట మ్యాజిక్ చేయబోతుంది అంటున్నారు చిత్రటీమ్.

vijay devarakonda rashmika 2nd movie

సమ్మర్‌లో రిలీజ్

ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం కాకినాడలోని ఓ మెడికల్ కాలేజీలో షూటింగ్ జరుపుకుంటుంది.అయితే అర్జున్ రెడ్డిలో డాక్టర్ పాత్రలో నటించిన విజయ్ ఈ సినిమాకు కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయి భారీ హిట్‌గా నిలుస్తోందని భావిస్తున్నాడట. మైత్రీ మూవీమేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తర్వాత క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ ఓ చిత్రంలో నటించబోతున్నాడు.వరుస హిట్స్ అందుకుంటున్న విజయ్ డియర్ కామ్రేడ్‌తో మరో హిట్‌ అందుకుంటాడో లేదో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *