బాలీవుడ్ కు వెళ్తోన్న దక్షిణాది చిత్రం!

బాలీవుడ్ కు వెళ్తోన్న దక్షిణాది చిత్రం!

పవన్ కళ్యాణ్ కెరీర్ లో మిక్స్డ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా కాటమరాయుడు… కమర్షియల్ సక్సస్ అయిన ఈ సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. మరి కాటమరాయుడు హిందీ రీమేక్ లో నటిస్తున్నది ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడండి

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రాల్లో ‘కాటమరాయుడు’ ఒకటి. మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించడంలో విఫలమయ్యింది కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఉరి సినిమాతో మంచి సక్సస్ అందుకున్న విక్కీ కౌశల్‌, కాటమరాయుడు హిందీ వెర్షన్ లో హీరోగా కనిపించబోతున్నాడు. మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని చేసే విక్కీ కౌశల్ మొదటిసారి నటిస్తున్న కంప్లీట్ కమర్షియల్ మూవీ ఇదే కావడం విశేషం.

సాజిద్‌ నదియాద్‌వాలా నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉన్న ఈ సినిమాకి ‘ల్యాండ్‌ ఆఫ్‌ లుంగీ’ అనే ఫన్నీ టైటిల్‌ను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు బి-టౌన్ వర్గాల సమాచారం. త్వరలోనే విక్కీ కౌశల్ ఈ మూవీకి సంబందించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నాడు. మరి తమిళ్ లో వీరమ్ గా సూపర్ హిట్ అయ్యి… తెలుగులో కాటమరాయుడుగా యావరేజ్ సినిమాగా నిలిచిన ఈ మూవీలో ల్యాండ్ ఆఫ్ లుంగిగా హిందీలో ఎలాంటి రిజల్ట్ రాబడుతుందో చూడాలి

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *