వేణు స్వామి ఇక మారడా... 

వేణు స్వామి ఇక మారడా... 

మానవ సమాజం ఎంతలా అభివృద్ధి చెందుతూ ఉన్న, ఇంకా ఎన్నో మూఢనమ్మకాలకు బానిసగానే ఉంది. ఇప్పటికీ జ్యోతిష్యాలూ, బానామతిల వంటి నమ్మకాలకు అతుక్కు పోయివుంది. సైన్స్‌పరంగా ఎంత ముందుకు వెళ్తున్నా, చిన్నచిన్న నమ్మకాల చుట్టూ తిరుతూనే ఉన్నాం. ఈ నమ్మకాలే మనల్ని అంతకంతకూ వాస్తవాలకు దూరంగా నిలబెతున్నాయి. వాటిని ఆధారంగా చేసుకునే మోసగాళ్లు తమ పరిధిని విస్తరించుకుంటున్నారు. ఒక్కోసారి కొందరి జ్యోతిష్యుల అసలు రంగు బయటపడ్డా, ఇంకా మాయ చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి ప్రయత్నాలను పసిగట్టగలగాలి. ఒకసారి ఈ ప్రముఖ జ్యోతిష్యుడి లేటెస్ట్‌ వ్యాఖ్చలు చూసొద్దాం పదండి…

జ్యోతిష్యం రాదని ఒప్పుకున్నాడు…

“వేణు స్వామి” రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ బాగా పరిచయమున్న పేరు. బాగా క్రేజ్‌ ఉన్న జ్యోతిష్యుల్లో ఒకరు. ఈయన్ని విశ్వసించే వారూ, అనుసరించే వారూ చాలామందే ఉన్నారు. ఎవరి భవిష్యత్తునైనా ఇట్టే చెప్పేయగలనని చెప్పుకుంటాడు. తాను చెప్పింది ఇప్పటి వరకూ వొమ్ము కాలేదని బాగానే ప్రచారం చేసకుంటాడు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడు. అయితే ఇటీవల ఒక టీవీ షోలో ఈయన బండారం బయటపడింది. బాబూగోగినేని వేణుస్వామి చేత అసలు నిజాన్ని బయట పెట్టించాడు. తనకు జ్యోతిష్యమే రాదని వేణుస్వామి నోటితోనే బాబూగోగినేని చెప్పించాడు.

వాజ్‌పేయి విషయం లోనూ…

venu swamy astrologer

దేశవ్యాప్తంగా ఎంతో మందిని కలవరపెట్టిన, భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి మరణం విషయంలోనూ… కొన్నిరోజుల క్రితం వేణు స్వామి జ్యోతిష్యపరమైన వ్యాఖ్యలు చేశాడు. సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. వాజ్‌పేయి జాతకాన్ని పరిక్షించానీ, అతని జాతకం ప్రకారం కొద్దిరోజుల్లో గండం ఉందనీ… తెలిపాడు.  “భారత మాజి ప్రధాన మంత్రి శ్రీ వాజ్‌పేయి గారి జాతకం అరుదైనది.4 సార్లు ఏలినాటి శని అనుభవించిన అరుదైన వ్యక్తి. మూలా నక్షత్రం ధనుస్సు రాశి ,,,నేటి నుండి (aug 15)రాబోయే 40 రోజులు సెప్టెంబరు 25 ,2018 లోపు గండము గోచరిస్తున్నది” అని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో తెలిపాడు. వాజ్‌పేయి ఆరోగ్యం బాగా క్షీణించిందన్న విషయం బయటకు రాగానే… ఇలాంటి విషయాలను తెలిపి, ఇది తన జ్యోతిష్య ప్రతిభే అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

“మరో ప్రముఖుడు కూడా” అంట…

venu swamy astrologer

వాజ్‌పేయితో పాటు మరో ప్రముఖుడి మరణం కూడా కొద్దిరోజుల్లో ఉండబోతుందని మరో విషయాన్నీ షేర్‌ చేశాడు. మొన్నటి గ్రహణం తర్వాత వరదలూ, ఇద్దరి ప్రముఖుల మరణాలూ సంభవించాలనీ, వాటి మూలంగానే కేరళ వరదలూ, వాజిపేయి మరణమూ… అనే కోణంలో జోష్యం చెప్పుకుంటూ పోయారు. కొద్దిరోజుల్లోనే మరో ప్రముఖుడి మరణమూ ఉందని… కోట్‌ చేసిమరీ తెలిపాడు. కాలం ఇంత ముందుకు పోతున్నా… గ్రహణాలకూ మానవ జీవితాలకూ ఎలంటా సంబంధమూ లేదని, సైన్స్‌ నొక్కివక్కానించి మరీ చెప్తున్నా… వేణుస్వామి లాంటి వాళ్తు ఇదే పనిగా ప్రజలకు మూఢ విశ్వాసాలను ప్రచారం చేస్తున్నారు. బుల్లితెర సాక్షిగా తనకు జ్యోతిష్యం రాదనీ, నిజం లేదనీ ఒప్పుకున్న వేణుస్వామి మళ్లీ ఎప్పటిలానే ప్రజలను మోసం చేసే పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *