అవన్నీ రూమర్స్‌ : నిర్మాత సురేష్ బాబు

అవన్నీ రూమర్స్‌ : నిర్మాత సురేష్ బాబు

మాధ‌వ‌న్, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించిన చిత్రం విక్ర‌మ్ వేదా.విక్ర‌మ్,భేతాళ క‌థ‌ల‌ని ఆధారంగా తీసుకొని త‌మిళంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గ‌ర సూపర్ హిట్‌గా నిలిచింది..వంద కోట్ల క్ల‌బ్‌లోకి చేరిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ కానుంద‌ని కొన్నాళ్ళ నుండి ప్ర‌చారం జ‌రుగుతుంది.తాజాగా వెంకటేష్‌,నారా రోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రీమేక్ చిత్రాన్ని రూపొందించ‌నున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.వీవీ వినాయ‌క్ డైరెక్షన్‌లో మాధ‌వ‌న్ పాత్ర‌లో నారా రోహిత్ న‌టిస్తే,విజయ్ సేతుప‌తి పాత్ర‌లో వెంకీ న‌టిస్తార‌నే న్యూస్ టాలీవుడ్ సర్కీల్‌లో చక్కర్లు కొడుతుంది.

విక్ర‌మ్ వేదా తెలుగు రీమేక్‌లో వెంకీ న‌టించడం లేదని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ప్ర‌స్తుతం వెంకటేష్ వెంకీ మామ అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు .ఈ సినియర్ హీరో నటించబోయే నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించి త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపింది సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *