పవన్ కళ్యాణ్ మార్కెట్ పై కన్నేసిన మెగా హీరో

పవన్ కళ్యాణ్ మార్కెట్ పై కన్నేసిన మెగా హీరో

ప్రస్తుతం యంగ్ హీరోలందరూ చాలా ఫిట్ గా ఉన్నారు తాను కూడా వాళ్లలాగా ఉండాలి అనుకున్నాడో లేక బాబాయ్ ని ఫాలో అవుతున్నాడో తెలియదు కానీ ‘ఎఫ్2’ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిస్తూ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న వరుణ్ తేజ్ ప్రయోగాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే కొత్త కథ అనిపిస్తే వెంటనే ఓకే చేస్తున్న వరుణ్, లేటెస్ట్ మూవీ రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్ళింది. ఈ చిత్రం కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్న ఈ మెగా హీరో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. కిక్ బాక్సర్ గా కనిపించడానికి రెడీ అవుతున్న వరుణ్… 6 ప్యాక్ కూడా ట్రై చేస్తున్నాడు. అయితే బాక్సింగ్, సిక్స్ ప్యాక్ అనేవి కష్టమైన పని కాబట్టి వాటికి తగ్గట్లు శ్రమిస్తున్న ఈ మెగా హీరో, బాబాయ్ పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తున్నట్లు ఉన్నాడు. వరుణ్ లాగే పవన్ కళ్యాణ్ కూడా కెరీర్ స్టార్టింగ్ లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ట్రై చేసి యూత్ లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ తొలిప్రేమ టైటిల్ ని వాడుకోని ఫీల్ గుడ్ మూవీ చేసి హిట్ అందుకున్న ఈ మెగా హీరో మరోసారి తన కిక్ బాక్సింగ్ సినిమాతో తమ్ముడు మూవీని గుర్తు చేసి సాలిడ్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లబోయే ఈ మూవీ కూడా హిట్ అయితే అతికొద్ది కాలంలోనే వరుణ్ తేజ్, ఫేస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం మెగాఫ్యామిలీలో మెగాస్టార్ చిరు ప్లేస్ ని ఫిల్ చేసి స్టార్ హీరోగా రామ్ చరణ్ సెట్ అయినట్లే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లేస్ లో వరుణ్ తేజ్ సెట్ అవుతాడా? అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ రాబట్టగలడా? అనే ప్రశ్నలకి మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *