పెళ్లికి రండి... ఎన్నికల ఫలితాలు వీక్షించండి!!

పెళ్లికి రండి... ఎన్నికల ఫలితాలు వీక్షించండి!!

పెళ్లికి వెళ్తే ఎవరైనా భోజనాలు పెడ్తారు.. కొంచెం ఉన్నవాళ్లైతే రిటర్నులు గిఫ్టు ఇచ్చి పంపిస్తారు.. మరీ ధనవంతులైతే వెండి వస్తువులను బహుమతిగా ఇచ్చి తమ ప్రెస్టేజ్‌ను చాటుకుంటారు. కానీ నెల్లూరులో ఓ వ్యాపారి తన కుమార్తె వివాహ వేడుకకు వచ్చేవారికి ఓ విచిత్రమైన ఆఫర్ ఇస్తున్నాడు. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడండి!

మే 23.. ఏపీ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు. ఇప్పటికే నెల రోజులకు పైగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు ఆ రోజున టీవీలకు అతుక్కుపోవడం ఖాయం. అయితే అదే రోజు ఏపీలో వందలాది వివాహాలు జరుగుతున్నాయి. అటు పెళ్లి.. ఇటు ఫలితాల హడావుడి కారణంగా.. ఆహ్వానించినవారంతా పెళ్లికి వస్తారో రారోనన్న సందేహం వెంటాడింది నెల్లూరుకు చెందిన ఓ వస్త్ర దుకాణ యజమానిని. అంతే బంధువులను పెళ్లి మండపానికి ఎలా రప్పించాలి అని బాగా ఆలోచించి.. అద్భుతమైన ప్లాన్ వేశాడు.

నెల్లూరులోని శుభమస్తు షాపింగ్ మాల్ యజమాని బయ్యా వాసు కుమార్తె పద్మా నివేదిత వివాహం ఈనెల 23వ తేదీనా జరగనుంది. అయితే అదే రోజు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కూడా జరగనుంది. వివాహం ఉదయం వేళ లోనే జరుగుతుండడం… అదే సమయం ఫలితాలు పీక్ స్టేజ్ లో వుంటాయి. ఈ టైం లో అధిక శాతం మంది టీవీలకు అతుక్కుపోతారు. కాబట్టి బయ్యా వాసు పెళ్లి మండపంలోనే పెద్ద పెద్ద స్క్రీన్ లు ఏర్పాటు చేసి అందులో.. ఎన్నికల ఫలితాలు లైవ్ ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని శుభలేఖపై రాసుకొచ్చారు.

బయ్యా శ్రీనివాస్‌ కూతురి పెళ్లి కోసం అచ్చు వేయించిన ఈ శుభలేఖ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. సోషల్‌ మీడియాలో అయితే వైరల్‌గా మారింది. మరి ఈ పెళ్లికి ఎంత మాత్రం జనాలు హాజరవుతారో వేచి చూడాలి

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *