కాటేసిందని...పామునే కొరికాడు తర్వాతేమైందంటే!?

కాటేసిందని...పామునే కొరికాడు తర్వాతేమైందంటే!?

ఇపుడంటే సామెతలు తక్కువగా వాడుతున్నారు గాని, ఒకప్పుడు దేని గురించి చర్చ మొదలైనా, ఏ విషయాన్ని చెప్పాలన్నా సామెతతో మొదలుపెట్టేవారు. అలాంటి వాటిలో బాగా ప్రాచూర్యం ఉన్న సామెత..కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, అదే మనిషి కుక్కని కరిస్తే పెద్ద వార్తై కూర్చుంటుంది అని. సాధారణంగా అయితే ఇది అసంభవం కానీ, నిజంగా జరిగితే మటుకు ఆశ్చర్యమే! కానీ ఈ సామెత నిజం అయిందంటే నమ్ముతారా మీరు. కాకపోతే ఇక్కడి సంఘటనలో కుక్క కాకుండా పాము వచ్చింది. మనిషే పాముని కరిచిన సంఘటన జరిగిందన్నమాట..ఆ కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం!

వడోదరాలోని అజన్వాకు చెందిన పర్వాత్ గాలా బరియా అనే రైతుని ఒక పాము కాటేసింది. తన మానాన తాను పోతుంటే కాటేసిందని కోపమొచ్చింది రైతుకు. అంతే…వెంటనే ఆ పాముని దొరకబుచ్చుకుని దాన్ని నోట్లో పెట్టుకుని గట్టిగా కొరికేశాడు. అయినా అతని కోపం తగ్గలేదు. దాన్ని తినేయాలనుకున్నాడు. అయితే…కొందరు స్థానికులు అతన్ని వారించి వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ పాముని స్థానికులు అదే ప్రదేశంలో కాల్చేశారు.

దురదృష్టం ఏంటంటే…పాముని కరిచిన పర్వాత్‌ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే ఆరోగ్యం విషమించిందని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. పాముని కొరికే సమయంలో పాము మళ్లీ కాటువేసిందని అందువల్లే చనిపోయాడని వైద్యులు తెలిపారు. పాము కాటేయగానే వైద్యం కోసం వెళ్లకుండా పామునే కాటేయబోయి తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు పర్వాత్. అతని మరణం గురించి కుటుంబసభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *