ఆఫీస్ టైం అవగానే వెళ్లిపోవాలి..లేదంటే అంతే!

ఆఫీస్ టైం అవగానే వెళ్లిపోవాలి..లేదంటే అంతే!

ఎలాంటి సంస్థలోనైనా ఎక్కువ పనిచేస్తే చాలని పై అధికారులు కోరుకుంటారు. కానీ ఉద్యోగస్తులు అలా ఎప్పుడూ ఉండరు. ఆఫీస్ సమయానికి పది నిమిషాలు ఆలస్యంగా రావడం, పది నిమిషాలు ముందుగానే వెళ్లిపోవడం చేస్తుంటారు. ఎక్కువ మంది ఇలా చేస్తారనే టెక్నాలజీ అందుబాటులోకి రాగానే సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగకుండా బయోమెట్రిక్ విధానాన్ని కూడా తెచ్చారు. దీంతో ఉద్యోగస్తులు తప్పక వారికిచ్చిన సమయంలో పని చేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఎలాంటి సంస్థలోనైనా ఎక్కువ పనిచేస్తే చాలని పై అధికారులు కోరుకుంటారు. కానీ ఉద్యోగస్తులు అలా ఎప్పుడూ ఉండరు. ఆఫీస్ సమయానికి పది నిమిషాలు ఆలస్యంగా రావడం, పది నిమిషాలు ముందుగానే వెళ్లిపోవడం చేస్తుంటారు. ఎక్కువ మంది ఇలా చేస్తారనే టెక్నాలజీ అందుబాటులోకి రాగానే సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగకుండా బయోమెట్రిక్ విధానాన్ని కూడా తెచ్చారు. దీంతో ఉద్యోగస్తులు తప్పక వారికిచ్చిన సమయంలో పని చేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. 

drone


ఇక్కడివరకూ బాగానే ఉంది. ఈ విధానాలన్నీ జపాన్‌లో కుదరవు. అక్కడి పనితీరు, ఉద్యోగస్తుల వ్యవహారం విభిన్నంగా ఉంటుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకంటే ఎన్నోరెట్లు ఆధునికతను సంతరించుకున్న దేశం జపాన్. అలాంటపుడు అక్కడ పని చేసే ఉద్యోగస్తులు చాలా కొత్తగా ఆలోచిస్తుంటారు. ఇతర దేశాల్లో సంస్థను విమర్శిస్తు నిరసన తెలపాలంటే పని మానేసి బయటకు వచ్చి ఆందోళనలు చేస్తారు. కానీ జపాన్‌లోని ఉద్యోగస్తులు ఇలా చేయరు. ఆఫీస్‌లోనే ఎక్కువ సమయం పనిచేసి వారి నిరసనను తెలుపుతారు. అలా ఎవరైనా పని గంటల కంటే ఎక్కువ సమయం ఆఫీస్‌లో ఉంటే వారిని బయటకు పంపేందుకు డ్రోన్‌లను ఏర్పాటు చేస్తున్నాయి ప్రభుత్వ కార్యాలయాలు. 

ఎవరైనా ఉద్యోగస్తులు పని సమయం గడిచిపోయినా కూడా ఆఫీస్‌లో ఉంటే ఈ డ్రోన్‌లకు తెలిసిపోతుంది. ఈ డ్రోన్ కెమెరాల ద్వారా పై అధికారులు పరిశీలించి..ఆ ఉద్యోగలపై చర్యలు తీసుకుంటారు. జపాన్‌లోని చట్టాల ప్రకారం ఒక ఉద్యోగి..ఒక నెలలో 100 గంటలకు మించి పని చేయడానికి లేదు. జపాన్‌లో ఉద్యోగస్తులు ఎక్కువ సమయం పని చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రావడం, ప్రాణాలను పోగొట్టుకోవడం జరుగుతోందని ఈ నియమాలను పెట్టారు. దీనికి పరిష్కారం కోసమే డ్రోన్‌లను ప్రవేశపెట్టి ఉద్యోగస్తులను సమయానికి ఇంటికి పంపిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *