'సోగ్గాడే చిన్ని నాయ‌నా'కు ప్రీక్వెల్‌గా 'బంగార్రాజు'

'సోగ్గాడే చిన్ని నాయ‌నా'కు ప్రీక్వెల్‌గా 'బంగార్రాజు'

2016లో సంక్రాంతి బరిలో దిగి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా సోగ్గాడే చిన్ని నాయ‌నా.. ఇందులో నాగార్జున డ్యూయల్ రోల్‌లో ఢిఫరెంట్ షేడ్స్‌లో నటించి మెప్పించాడు. ఈ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం బంగార్రాజు పాత్ర. ఆ క్యారెక్టర్‌లో కింగ్ నాగ్ నటనకు అంత ఫిదా అయ్యారు.అంతేకాదు నాగ్ కెరీర్‌లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించింది. దీంతో ఈ సినిమా షూటింగ్ చేస్తున్న టైంలోనే ప్రీక్వెల్ చేయలనుకున్నాడట నాగార్జున. ప్రస్తుతం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రీక్వెల్ స్క్రిప్ట్‌కి ఫినిషింగ్ ట‌చ్ ఇస్తున్నాడట. బంగార్రాజు టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా జూలైలో సెట్స్ పైకి వెళ్లానుందని తెలుస్తోంది. ఈసారి ఈ సినిమాలో నాగార్జనతో కలిసి నాగ్ కోడుకు స్ర్కీన్ షేరు చేసుకోబోతున్నాడని సమాచారం…

ఈ సినిమా మొత్తం బంగార్రాజు క్యారెక్టర్ చుట్టే తిరుగుతుందట.ఇందులో నాగ్ క్యారెక్టరైజైషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ని తెలుస్తోంది.నాగ్ జోడీగా ‌ర‌మ్య‌కృష్ణ‌ నటిస్తోంది.ఈ మూవీలో నాగార్జునతో కలిసి నాగచైతన్య కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న‌ట్టు తెలుస్తుంది.బంగార్రాజు మ‌న‌వ‌డి పాత్రలో చైతూ క‌నిపించబోతున్నడట.అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.మరి సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫ్రీక్వెల్‌గా రాబోతున్న ఈ బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *