విద్యార్థి సర్‌ప్రైజ్‌కి కన్నీళ్లు పెట్టుకున్న గురువు

విద్యార్థి సర్‌ప్రైజ్‌కి కన్నీళ్లు పెట్టుకున్న గురువు

ప్రతీవ్యక్తి జీవితంలో గురువుకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ వ్యక్తి ఏ స్థాయికి వెళ్లినా సదా గురువుని తలుచుకుంటాడు. అలాగే, విద్యార్థి గొప్ప స్థాయికి వెళ్లాడని తెలిస్తే…ఆ గురువుకి కలిగే ఆనందాన్ని విలువ కట్టలేం. ఇలాంటి సందర్భమే ఎదురైంది ఒక విద్యార్థికి…దీన్ని చూసిన అక్కడున్న వారు కూడా కంటతడి పెట్టుకున్నారు.

piolet gift to her teacher

ఎడమవైపు నల్లకోటు వ్యక్తి..!

టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో ఒక వృద్ధుడు ప్రయాణిస్తున్నాడు. అదే విమానానికి, ఆ వృద్ధుడి దగ్గర చదువుకున్న ఓ విద్యార్థి పైలట్‌గా ఉన్నాడు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన తన గురువు, తను నడిపే విమానంలో ప్రయాణిస్తున్నాడని తెలుసుకుని అతను చాలా సంతోషపడ్డాడు. నేరుగా వెళ్లి పలకరించడంకంటే ఏదైనా సర్‌ప్రైజ్ ఇస్తే బాగుంటుందని భావించాడు. తన క్యాబిన్ నుంచి విమానంలోని అందరికీ వినబడేలా…” విమానంలో ఎడమవైపు నల్లకోటు వేసుకున్న వ్యక్తి నా స్కూల్ టీచర్. చిన్నపుడు నాకు చదువు చెప్పిన గురువుగారు. ఈ రోజు నేను నడుపుతున్న విమానంలో ప్రయాణిస్తున్నారని తెలిసి చాలా సంతోషపడుతున్నాను. దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుంది. నా గురువుకి గుర్తుండిపోయేలా చిన్న సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆయనకు పువ్వులు ఇచ్చి విష్ చేయాల్సిందిగా సిబ్బందిని కోరుకుంటున్నాను ” అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.

అందరి కళ్లను తడి చేసింది!

ఊహించని ఈ సర్‌ప్రైజ్‌తో ఆ టీచర్‌కి కన్నీళ్లు ఆగలేదు. కొన్ని క్షణాల్లోనే విమానంలోని సిబ్బంది ఫ్లవర్ బొకేలు ఇచ్చి టీచర్‌ని విష్ చేశారు. తర్వాత క్యాబిన్‌లో ఉండే ఆ పైలట్ తన టీచర్‌ని కలవడానికి వచ్చాడు. టీచర్‌ని ఆలింగనం చేసుకున్నాడు. దీన్ని చూసిన తోటి ప్రయాణికులు కూడా వీరిని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. చప్పట్లు కొట్టి పైలట్‌ను అభినందించారు. వారిలో ఒకరు ఈ ఉద్వేగభరితమైన దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *