టిక్‌టాక్ కోసం స్టంట్ ప్రయత్నిస్తే..మెడ విరిగింది!

టిక్‌టాక్ కోసం స్టంట్ ప్రయత్నిస్తే..మెడ విరిగింది!

యువత చేతిలో ఇంతకుముందు స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని మర్చిపోయేవారు. ఆ తర్వాత సెల్ఫీలు తీసుకోవడంలో బిజీ అయ్యారు. అది కూడా పోయి రకరకాల యాప్‌లు వచ్చాయి. ఈ యాప్‌లలో గేమ్స్, వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికైతే టిక్‌టాక్‌లంటూ రకరకాల డ్యాన్స్‌లు, ఫీట్లు చేస్తున్నారు. సరదా పేరు చెప్పి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్న పరిస్థితి ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. అలా టిక్‌టాక్ వీడియో చేయాలనే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. ఎలా జరిగిందో తెలుసుకుందాం!

కర్ణాటకలోని తుముకూరు జిల్లా చిక్కనాయగనహళ్లి సమీపంలో గూడకెరె్‌కు చెందిన కుమార్ అనే యువకుడు సరదాగా టిక్‌టాక్ వీడియోలు చేస్తూ ఉంటాడు. రోజూలాగా చేయడం బోర్‌గా ఉందని చెప్పి వెరైటీ కోసం స్నేహితుడితో కలిసి స్టంట్ చేయాలాని చూశాడు. సినిమాల్లో చూపించినట్టుగా స్నేహితుడి చేతిలో కాలుపెట్టి…వెనక్కి దూకబోయాడు. ఎదురుగా స్నేహితుడి చేతిలో కాలుపెట్టి…బ్యాక్ జంప్ చేసే క్రమంలో పట్టు తప్పి పట్టాడు. అలా పడే క్రమంలో బ్యాక్ జంప్‌లోని మెలకువలు తెలియకపోవడం వల్ల మొదట తల నేలకు తాకి…తర్వాత శరీరం మొత్తం మెడపైనే భారం పడింది. దీంతో కుమార్ మెడ విరిగిపోయింది. ప్రమాదం గ్రహించిన అతని స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కుమార్ మెడ భాగం విరిగిపోయిందని, వెన్నెముకలు కూడా విరిగినట్టు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆ యువకుడు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *