ఇండోనేషియాలో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలతో జనం బెంబేలు..

ఇండోనేషియాలో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలతో జనం బెంబేలు..

ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. భూకంప తీవ్రత మాగ్నిట్యూడ్‌ స్కేల్‌పై 7.1గా నమోదైంది. దీంతో ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. చెప్పాలంటే ఇండోనేషియా ప్రజలు వరుస భూకంపాలతో భయాందోళనలకు గురవుతున్నారు. ఇక అక్కడి ప్రభుత్వం తీర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సులవేసి, నార్త్‌ మాలుకు ద్వీపాల మధ్య ఉన్న మొలుక్క సముద్రంలో ఈ భూకంపం సంభవించింది.

మనాడోకు ఆగ్నేయంగా 185 కిలోమీటర్ల దూరంలో 24 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశముందనీ విపత్తు నిర్వహణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు ఇండోనేషియాలో సంభవించిన భూకంపం అతిశక్తివంతమైందిగా గుర్తించారు. ఇక ఈ ప్రకంపనలతో టెర్నెటే నగరంలో నివసించే వారు భయాందోళనకు గురై ఇళ్లల్లోంచి బయటకు పరగులు తీశారు. దీంతో అక్కడి అధికార వర్గాలు ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *