ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు

ఇరాన్‌పై అమెరికా రెండో విడత కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను చావుదెబ్బతీయాలనే లక్ష్యంతో ఈ ఆంక్షలను అమల్లోకి తెచ్చింది.  ఇరాన్‌తో న్యూక్లియార్‌ డీల్‌ నుంచి అమెరికా వైదొలగడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఈ ఆంక్షలు ఇరాన్‌ చమురు వ్యాపారం, షిప్పింగ్‌, బ్యాంకింగ్‌ రంగాలపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. దీనిపై ఇరాన్‌  స్పందించింది. తాము చమురు విక్రయాలను కొనసాగిస్తామని తెలిపింది. అమెరికా ఆంక్షలను  ధైర్యంగా ఎదుర్కొందామని వెల్లడించింది. ట్రంప్‌ మాత్రం ఇరాన్‌తో మరోసారి చర్చలు జరగాల్సి ఉందని బలంగా విశ్వసిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *