నోరు మూసుకుని కూర్చో...అమెరికా మీడియాపై ట్రంప్ చిందులు

నోరు మూసుకుని కూర్చో...అమెరికా మీడియాపై ట్రంప్ చిందులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై చిందులు తొక్కారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు విజయం సాధించిన నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ట్రంప్.. విలేకరులు అడిగిన ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

trump vs cnn reporter

వైట్ హౌస్ లోకి రాకుండా నిషేధం

అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం, వలసదారులపై కఠిన వైఖరిని ప్రశ్నించిన సీఎన్ఎన్ రిపోర్టర్ జిమ్ అకోస్టాపై విరుచుకుపడ్డారు. ‘నువ్వు నీ ప్రవర్తన పట్ల సిగ్గుపడాలి. నువ్వు సీఎన్ఎన్ లో పని చేయడకూడదు. నోరు మూసుకుని కూర్చో.’ అంటూ తీవ్ర వాగ్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా జిమ్ అకోస్టా వద్ద ఉన్న మైక్ ను లాక్కునేందుకు ఓ మహిళా ఉద్యోగి యత్నించారు.

మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో వైట్ హౌస్ లోకి జిమ్ కోస్టా ప్రవేశాన్ని రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఓ మహిళా ఉద్యోగిపై చేయి వేసినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. ఈ ఘటనపై జిమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *