ఇవేమి ఫలితాలు దేవదేవా..

ఇవేమి ఫలితాలు దేవదేవా..

తెలంగాణ ఓటర్ల మనోనైజం అంతుచిక్కడం లేదు… తెలంగాణ ఓటర్ల అభిమతం తెలియడం లేదు.. తెలంగాణ ఓటర్లు ఎవరి పక్షమో తేలడం లేదు. ఒక్కో ఎన్నికకు ఒక్కో విధంగా మిశ్రమ ప్రేమను చూపిస్తున్నారు తెలంగాణ ఓటర్లు. తెలంగాణ శాసన సభకు జరిగిన ముందస్తు ఎన్నికలలో టీఆర్ఎస్‌కు అప్రతిహత విజయాన్ని అందించారు. తెలంగాణలో విపక్షాలన్ని ఒకే తాటిపైకి వచ్చి మహాకూటమిగా ఏర్పడినా దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నాయి. దీంతో తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ ను అక్కున చేర్చుకున్నారని భావించారు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ప్రజలలో వ్యతిరేకత ప్రారంభమయ్యిందంటూ విపక్షాలు సంబురాలు చేసుకున్నాయి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని, ముఖ్యమంత్రి పట్ల వ్యతిరేకతతో ఉన్నారని వార్తలు వచ్చాయి.

ఇటీవల లోక్ సభకు జరిగిన ఎన్నికలలో పదహారు స్దానాలు తమవేనని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. “పదహారు… కారు.. డిల్లీలో సర్కారు” అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలచింది. అయితే తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి 3 స్దానాలు, బిజేపీకి 4 స్దానాలు కట్టబెట్టి వినూత్న ఫలితాలు ఇచ్చారు. లోక్ సభ ఫలితాల తీరుతో టిఆర్ఎస్ కార్యనిర్వాహణ అధ్యక్షుడు కేటీఆర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణ ఓటర్లు అధికార పార్టీపై ఆగ్రహాంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే నెలరోజులు గడవక ముందే జరిగిన స్దానిక సంస్ధల ఎన్నికలలో గులాబి దళం దుమ్మురేపింది. బ్యాలెట్ పద్దతిన జరిగిన స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్, బిజేపీ.. టీఆర్ఎస్ విజయాన్ని నిలువరించలేకపోయాయి. స్థానిక సంస్దలలో వచ్చిన విలక్షణ తీర్పుతో తెలంగాణ ఓటర్ల మనోగతం ఏమిటో తేలడం లేదు. ఒకసారి అధికార పార్టీ వైపు మరోసారి విపక్ష పార్టీవైపు మొగ్గు చూపుతున్న తెలంగాణ ఓటర్లు పూర్తీగా ఎవరి పక్షమూ కాదని తేటతెల్లమవుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *