ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ మొదటి అభ్యర్థి!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ మొదటి అభ్యర్థి!

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉందో గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే తెలుస్తాయి.”మన రాష్ట్రం,మన పాలన..ఔర్ ఏక్ బార్ “కేసీఆర్ నినాదాలతో ప్రతిపక్షాలకు చోటు లేకుండా గెలిచింది.ముఖ్యంగా తెలంగాణలో టీడీపీ పార్టీనీ నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రచారం నడిచింది అంటే కేసీఆర్ వ్యూహం ఎలాంటిదో తెలుసుకోవచ్చు.ఫలితాలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూడా మా వ్యూహాన్ని అమలు చేస్తామని,చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ముందుగానే చెప్పారు కేసీఆర్.ఇపుడు ఆ మాట నిజమయ్యేలాగే కనిపిస్తోంది.గత కొద్ది వారాలుగా జగన్‌ను నేరుగా సపోర్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రభావం చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు.కేటీఆర్..జగన్‌ని కలవడం కూడా వారి వ్యూహంలో భాగమే అని తెలుస్తోంది.

TRS Contest in AP

ప్రచారానికి కేసీఆర్..

కేసీఆర్ చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీకీ అభ్యర్థి సిద్ధమయ్యాడు.విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ వీరాభిమాని కొణిజేటి ఆదినారాయణ అనే వ్యక్తి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నట్టు ప్రకటించారు.గతంలో ఆదినారాయణ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ ఇంద్రకీలాద్రీ వద్ద 101 కొబ్బరికాయలు కొట్టారు.ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ఇంద్రకీలాద్రి కొండను మోకాళ్లపై ఎక్కి వార్తల్లో నిలిచారు.ఇపుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతానంటూ సవాల్ విసురుతున్నాడు.తెలంగాణ ఎంపీ అభ్యర్థులతో పాటుగా తాను కూడా కేసీఆర్ దగ్గరినుంచి బీ ఫారమ్ తీసుకుంటానని,ప్రచారానికి కేసీఆర్‌ను కూడా తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *