ఓటమికి చేరువలో నందమూరి సుహాసిని

ఓటమికి చేరువలో నందమూరి సుహాసిని

ఊరువాడా సంబరాల్లో మునిగితేలుతున్న తెరాస. కౌంటింగ్ మొదలైనప్పటినుంచి స్పష్టమైన అధిక్యతను సాధిస్తూ…ప్రజాకూటమికి ఎక్కడా దరిదాపుల్లో రానివ్వకుండా కారు దూసుకుపోతోంది. దీంతో విజయం మాకే అని టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు విజయోత్సవాల్లో తేలుతున్నారు.

సంబరాలు చేసుకుంటున్న టీఆర్ఎస్ కార్యకర్తలు

మొదటినుంచి కూడా ప్రజాకూటమి ఎలాంటి ప్రభావం చూపకుండా డీలా పడిపోయింది. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున బరిలో దిగిన హరికృష్ణ కుమార్తె, నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇక్కడ ముందంజలో కొనసాగుతున్నారు.

kukatpally results

హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గాల్లో కూకట్‌పల్లి కూడా ఒకటి. గతంలో ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న కూకట్‌పల్లి, 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. నగరంలో ఆంధ్రప్రాంతం వారు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి మాధవరం కృష్ణారావు గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి మాధవరం కృష్ణరావు కూకట్‌పల్లి నియోజకవర్గ అభ్యర్థిగా నిలబడ్డారు. మొదట ఈ స్థానం నుంచి టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డికి టికెట్ కేటాయించాలని భావించారు. కానీ అనుకోకుండా, ఎవరూ ఊహించని రీతిలో ఈ స్థనం నుంచి నందమూరి సుహాసినిని నిలబెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయంతో ఆమెకు ఈ టికెట్ దక్కింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *