కొత్త హీరోయిన్స్‌కు సవాల్ విసురుతున్న త్రిష

కొత్త హీరోయిన్స్‌కు సవాల్ విసురుతున్న త్రిష

హీరోయిన్‌గా కెరీర్ ఎండ్ క్లాప్ పడుతుందని అనుకుంటున్న టైంలో మళ్లీ లైమ్ టైట్‌లోకి వచ్చింది చెన్నై చిన్నది త్రిష. ఇప్పుడు ఈ సినీయర్ బ్యూటీ కొత్త హీరోయిన్స్‌కు సవాల్ విసురుతుంది. వరస సినిమాలతో బిజీగా ఉన్న త్రిష తాజాగా మరో సినిమా స్టార్ట్ చేసింది. ఇంతకి ఏ విషయంలో కొత్త హీరోయిన్స్ త్రిష సవాల్ విసురుతుందో చూద్దాం..

ఒక‌ప్పుడు సౌత్‌లో స్టార్ హీరోలందరితో నటించిన చెన్నై బ్యూటీ త్రిష. తక్కవ టైంలోనే టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఈ బ్యూటీకి ఆ మధ్య సినిమాలు కరువే అయ్యాయి. కానీ ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్‌తో బిజీ బిజీగా ఉంది.. తమిళ తంబీలు ఇప్పుడు ఈ బ్యూటీని సూపర్ లేడి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. తమిళ్‌లో ఇటీవలే వచ్చిన 96 మూవీ భారీ హిట్‌గా నిలిచింది. దీని తరువాత రజనీకాంత్‌తో పేట సినిమాలో నటించింది. ఈ మూవీ తెలుగులో అంతగా ఆడకపోయిన తమిళ్‌లో మాత్రం మంచి విజయం సాధించింది.దీంతో కొత్త హీరోయిన్స్‌ వచ్చే అవకాశాలు కూడా త్రిషనే వరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ కిట్టీలో అర‌డ‌జ‌నుకి పైగా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

మురుగ‌దాస్ శిష్యుడు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో త్రిష ప్ర‌స్తుతం క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ నేప‌థ్యంలో రూపోందుతున్న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు రీసెంట్‌గా జరిగాయి. ఈ మూవీకి రాంగి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఈ మూవీతో పాటు మరో రెండు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేసేందుకు సైన్ చేసిందట. అయితే ఇంతకుముందు త్రిష చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ నాయ‌కి, మోహిని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజయం సాధించ‌లేక‌పోయాయి. మ‌రి ఈ చిత్రంతో అయిన స‌క్సెస్ సాధిస్తుందా చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *