ట్రాఫిక్ చలానా పెళ్లికార్డ్‌గా మారింది!

ట్రాఫిక్ చలానా పెళ్లికార్డ్‌గా మారింది!

బైక్‌ల మీద వెళ్తూ హెల్మెట్ లేకుండా వెళ్తాం. దారిలో ఎక్కడా ఏ పోలీసుకి దొరక్కూడదని జాగ్రత్తగా ప్రయాణం చేస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా అంతే..ఏ పోలీసుకి కనబడకూడదు, ఇక్కడ సీసీ కెమెరాలు ఉండకూడదు అనుకుంటూనే ఉంటాం. అయితే…దేశంలోని చాలామందికి ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే భయం…ఎక్కడ ట్రాఫిక్ వైలెన్స్ అయి చలానా కాట్టాల్సి వస్తుందో అని…అయితే…అగ్మదాబాద్‌కు చెందిన ఒక ప్రేమజంటకు మాత్రం సీసీ కెమెరాలు ఎంతో సహాయం చేశాయి. ట్రాఫిక్ చలానా ఓ ప్రేమకథను కలిపింది.

ట్రాఫిక్ చలానాకు ప్రేమకథకు సంబంధం ఏంటనుకుంటున్నారా.. అయితే…చదవండి! గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ వెరైటీ లవ్ కహానీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఏకంగా పోలీసులే ఈ ప్రేమ జంటను చూసి ఫిదా అయ్యారు మరి! విషయానికొస్తే.. అహ్మదాబాద్‌కు చెందిన వత్సల్ పరేఖ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ రోజూ బైక్‌పై చెట్టాపట్టాలేసుకొని మరీ తిరుగుతోంది. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో పెద్దలకు తెలియదు. ఇదే క్రమంలో కొద్ది రోజుల క్రితం పరేఖ్ ప్రియురాలితో కలిసి నగరంలో తిరిగాడు. అయితే ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ జంట సీసీ కెమెరాలకు చిక్కింది.

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లైన్ క్రాస్ చేసి.. జీబ్రా లైన్‌పైకి బైక్ వెళ్లింది. సిగ్నల్స్ దగ్గరున్న సీసీ కెమెరాల్లో ఇదంతా రికార్డు కావడంతో..ట్రాఫిక్ పోలీసులు నేరుగా ఇంటికి చలానా పంపారు. చలానాలో ఉన్న ఫోటో చూసి పరేఖ్ తల్లిదండ్రులు ఖంగుతున్నారు. తమ కొడుకుతో బైక్‌పై ఉన్న అమ్మాయిని చూసి షాకయ్యారు. అమ్మాయి గురించి ఆరా తీస్తే.. ఆమెను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు మనసులో మాట చెప్పెశాడు. పరేఖ్ నిజాయితీగా తన ప్రేమ గురించి చెప్పేయడంతో తల్లిదండ్రులు ఓకే చెప్పారు. నేరుగా వెళ్లి యువతి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఇరు కుటుంబాల పెద్దల అనుమతి దొరకడంతో వారికి పెళ్లి కుదిరింది. రెండు రోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. దీంతో పరేఖ్ తమ ప్రేమ ఫలించి పెళ్లి జరగడానికి కారణమైన అహ్మదాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు. ఓ ట్వీట్ చేసి.. జరిగిన చలానా కథంతా చెప్పాడు. పోలీసులు కూడా ఈ ట్వీట్, ఫేస్‌బుక్ పోస్టులకు లైక్ కొట్టింది. మొత్తానికి పరేఖ్ తన లవ్ స్టోరీతో సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అయ్యాడు. ప్రియురాలితో పెళ్లికి సిద్ధమయ్యాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *