యాడ్‌లు చెయ్యడంలో ముందు ఉన్న టాలీవుడ్‌ స్టార్స్‌

యాడ్‌లు చెయ్యడంలో ముందు ఉన్న టాలీవుడ్‌ స్టార్స్‌

మన దేశంలో లాజిక్‌ ల కంటే మ్యాజిక్ లే ఎక్కువ ఫేమస్… డాక్టర్ల కంటే బాబా లకే ఎక్కువ డిమాండ్ … రియల్ హీరోల కంటే రీల్ హీరోలకే ఎక్కువ ఇమేజ్…అభిమాన తార వెండితెర మీద వెలగగానే గుండెలు చీల్చుకొనే వీరాభిమానులున్నారిక్కడ… అభిమాన తార ను అనుసరించడంలో అభిమానులకుండే కిక్కే వేరప్ప…అందుకే హీరో ఏ కూల్ డ్రింక్ తాగుతాడో అదే ఆర్డర్ ఇస్తాడు అభిమాని… అయితే కూల్‌ డ్రింక్స్‌తో లాభ మెవరికి ? యాడ్స్‌ ద్వారా సెలబ్రిటీలు ఎంత సంపాదిస్తున్నారు..? ఎండార్స్‌మెంట్లతో ఏఏ హీరో ఎంత వెనకేసుకుంటున్నారో ఓ లుక్కేద్దాం..

సినిమాల ప్రమోషన్ లు చెయ్యమంటే ఒళ్ళు బద్ధకంగా కదులుతారు గానీ డబ్బులు ఒచ్చే యాడ్‌లు లు చెయ్యడం లో మాత్రం హీరోలు ముందు ఉంటారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఎక్కడ హీరో అయినా కూడా యాడ్ రెవిన్యూ మీద తెగ ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే సంవత్సరాలు పాటు షూటింగ్‌లు చేస్తే వచ్చే ఆదాయం కంటే తక్కువ నిడివి గల యాడ్స్‌ లో నటిస్తే ఒక్కో ఎండార్స్‌మెంట్‌ కు హీరోలకు భారీగానే ముట్టచెబుతాయి ఆయా కంపెనీలు.. అందుకే అసలు కంటే కొసరు ముద్దు అన్నట్లు ఈ మధ్య కథానాయకులు యాడ్ల పైనే ఎక్కువ దృష్టి పెట్టారు…

ఇవాళ ఏదోటి అదరకొడ్తాం అంటూ వచ్చే థమ్స్‌అప్‌ యాడ్ క్యాంపైన్ ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపింది. ఒక్కో ఎండార్స్‌మెంట్లకు ఈ టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ 25 కోట్లకు పైనే చార్జ్‌ చేస్తున్నట్లు సమాచారం..సౌత్ ఇండియాలో తయారవుతున్న యాప్పి ఫిజ్ ను ఎన్టీఆర్ ప్రమోట్ చెస్తున్నాడు. ఈ ప్రమోషన్ కి ఎన్టీఆర్ భారీగానే రెమ్మూనరేషన్‌ తీసుకొన్నట్లు టాలీవుడ్ సమాచారం. ఈ మధ్య కమర్షియల్ యాడ్స్ తో బాగా పాపులర్ అయిన మరో సౌత్ స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు.ఇక రీసెంట్ గా బన్నీ చేస్తున్నఓ కూల్‌ డ్రింక్‌ యాడ్‌కు సైన్‌ చేశాడు. దీనికి ఆ కంపెనీ 18 కోట్లకు పైగా ముట్టచెప్పినట్లు ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌ లో టాక్‌.

ఇక సౌత్‌ ఇండియాలో సూపర్ స్టార్ లు ఇలాంటి యాడ్ చేస్తే దాని ప్రభావం ఖచ్చితంగా మార్కెట్ పై ఉంటుంది. సేల్స్ పెరుగుతాయని కంపెనీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే సమ్మర్‌ లో అమ్మకాలు తమ అంచానాలకు చేరువైయ్యాయని ఆయా కంపెనీ ప్రతినిధులు బహాటకంగానే చెబుతుతున్నారు.

గతంలో చిరంజీవి థమ్స్ అప్ యాడ్ చేస్తే ఆహా…ఓహో అన్నారు అభిమానులు. అంతేకాదు ఆ కూల్ డ్రింక్ ని తెగ తాగేశారు. ఇక ఖైదీ నెంబర్ 150 సినిమాలో చిరంజీవి అదే మెగాస్టార్‌ కోలా కంపెనీ పై యుద్ధం చేస్తుంటే ఆహా…ఓహో….అన్నారు. హీరోలు ఆలోచించకపోయినా అభిమానులైనా కాస్త ఆలోచించాల్సింది.. మనం అభిమానులుగా కంటే ముందు ఆత్మగౌరవం ఉన్న మనుషులమని… మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఈ కూల్ డ్రింక్ వలన శరీరానికి జరిగే నష్టాలేంటి అని రాసుకుంటూ పోతే పెద్ద లిస్టు తయారవుతుంది. ఇన్నిరోజుల సోడా శారీరక సమస్యలే తెస్తుంది అని మనకు తెలుసు, కాని మానసిక సమస్యలు కూడా సోడా వలన దగ్గరికొస్తాయని ఇటీవలే జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అందుకే కూల్‌డ్రింక్స్‌ మానేసి సహజసిద్ధమైన కొబ్బరిబోండాలు, పండ్ల రసాలు తాగితే మంచి ఆరోగ్యంతో పాటు రైతుకు మేలు చేసిన వాళ్లమవుతాం.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *