సాయంత్రానికి...తెలంగాణలో ఎన్నికల ప్రచారం బంద్

సాయంత్రానికి...తెలంగాణలో ఎన్నికల ప్రచారం బంద్

ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రానికి ముగిసిపోతుంది. అసెంబ్లీ రద్దు చేసి మూడు నెలలు. నాయకులు, ఓటర్లు అంటూ…చూస్తుండగానే మూడు నెలలు గడిచిపోయాయి. రోజులో 24 గంటలూ కష్టపడి ప్రతీ నియోజకవర్గాన్ని చుట్టేశారు నాయకులు. ఇన్ని రోజులు ఒక ఎత్తైతే చివరి రోజు జరిగే ప్రచారం మరో ఎత్తు. నాయకుల భవితవ్యం ప్రజల వేళ్లలో ఉంటుంది. దానికోసం ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు రంగం సిద్ధం చేశాయి.

డబ్బుని, మద్యాన్ని ఆపగలరా..?

ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. రోడ్లలోనూ, కూడళ్లలోను మైకులన్నీ నిశ్శబ్దమైపోతాయి. సభలు, రోడ్‌షోలు, ర్యాలీలు అన్నిటినీ లాగ్అవుట్ చేయాలి. రాజకీయనాయకులు, ఈసీ విధించిన నిభందనలు ఖచ్చితంగా పాటించితీరాలి. ఇవన్నీ బంద్ అవుతాయి కానీ డబ్బులు పంచడం, మందు సప్లై చేయడం ఆగుతాయా…అంటే కావనే చెప్పాలి. రహస్యంగా ఇవన్నీ ప్రవహిస్తూనే ఉంటాయి. బీర్లు, బిర్యానీలు పంచి ఓటర్లని ప్రలోభాలకు గురిచేసే పర్వం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇదంతా ఈసీ కళ్లకు దొరక్కుండా జరిగే తంతు. ఇలాంటి ఘటనలపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈరోజు సాయంత్రం నుంచి మద్యం అమ్మకాలను, బల్క్ ఎస్సెమ్మెస్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.

రెండురోజులు డ్రై డే…

ఇంకో రెండు రోజుల్లో పోలింగ్ జరుగుతుంది. కాబట్టి ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కి 48 గంటల ముందు ప్రచారాన్ని ఆపేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ఉన్నందున ప్రచారం కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకే ముగుస్తుంది. ప్రచారం ముగిసిన సమయం నుంచి రాష్ట్రంలో ఎటువంటి మద్యం అమ్మకాలు జరపకూడదు. డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటలనుంచి 7వ తేది సాయంత్రం 5 గంటల వరకు డ్రై డేగా పాటించాల్సి ఉంటుంది అని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్ ప్రకటించారు. సర్వేలు, ఇతర ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు ప్రసారంగానీ, ప్రచారం గానీ చేయకూడదని సూచించారు.

ఓతరు కార్డు లేకపోయినా ఓటు వేయొచ్చు…

ఓటరు గుర్తింపు లేని వారు ఇతర 12 రకాల గుర్తింపు కార్డుల ద్వారా తమ ఓటుని వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల కోసం 119 నియోజకవర్గాల్లో 32,815 పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎన్నికల భద్రతకు సంబంధించి వాటి ఏర్పాట్లపై డీజీపీ మహేందర్ రెడ్డి, నోడల్ అధికారి, అడినషనల్ డీజీపీ జితేందర్, ఇంటిలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌తో సమావేశమయ్యారు. భద్రతల కోశం అనుసరించాల్సిన వ్యూహాలు, పోలీసు బలగాల మోగరింపు విషయాలపై చర్చించారు.

పోలింగ్ సమయంలో ఉచితంగా వచ్చిందని తాగి ఓటు వేయడానికి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా బ్రీత్ అనలైజర్లను ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మందు తాగి ఓటు వేయడానికి వీలు లేదని చెప్పారు. మందు తాగి వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు ముందే హెచ్చరిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *