ఆస్ట్రేలియాలో మూడు కళ్లు ఉన్న పాము

ఆస్ట్రేలియాలో మూడు కళ్లు ఉన్న పాము

త్రినేత్రుడు లాగా..మూడు కళ్ల సర్పం ఒకటి నెటిజనులను ఆకట్టుకుంటోంది. ఆస్ట్రేలియాలో మూడు కళ్లు ఉన్న పామును గుర్తించారు. ఉత్తర ఆస్ట్రేలియాలో వ‌న్యప్రాణి అధికారులు ఈ పాము ఫోటోలను త‌మ ఫేస్‌బుక్ పేజిలో పోస్టు చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరలయ్యాయి. 8 వేలకు పైగా కమెంట్లను, 14వేలకు పైగా షేర్లను సాధించింది.

డార్విన్ స‌మీపంలోని అర్న్‌హెమ్ హైవేపై మొద‌టిసారి చూసిన ఈ సర్పాన్ని కార్పెట్ పైథాన్‌గా గుర్తించారు. కాగా మార్చి నెల‌లో ఇది అట‌వీ అధికారుల‌కు చిక్కింది. స‌హ‌జ‌సిద్ధమైన జ‌న్యు మ్యుటేష‌న్ వ‌ల్ల ఇలా మూడు కండ్లు వ‌చ్చి ఉంటాయ‌ని అధికారులు అంచ‌నా వేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *