ఇది మన ఎన్నికల 'ఖర్చు' కథ

ఇది మన ఎన్నికల 'ఖర్చు' కథ

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల పండుగ వచ్చేసింది. 17 వ లోక్‌సభ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖర్చుతో కూడుకున్న ఎన్నికలుగా నిలువనున్నాయి. ఈ ఎన్నికలకు 50 వేల కోట్ల రూపాయిలు ఖర్చువుతాయని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ అంచనా . అమెరికా అధ్యక్ష పదవికి 2016లో జరిగిన ఎన్నికల్లో 45 వేల 259 కోట్లు వ్యయమైంది. దీని కంటే ఎక్కువగా ఈసారి భారత్‌లో ఎన్నికల ఖర్చు ఉంటుంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల కంటే ఈసారి 40 శాతం ఎక్కువగా ఎన్నికల ఖర్చు పెరుగనుందని సీఎంఎస్ పేర్కొంది.

This is our election cost story

ఎన్నికల నిమిత్తం రవాణా, ప్రకటనలకు ఎక్కువ ఖర్చుకానున్నట్లు సీఎంఎస్ చైర్మన్ ఎన్ భాస్కర్‌రావు తెలిపారు. సోషల్ మీడియా ఖర్చు కూడా ఈసారి భారీగా పెరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 250 కోట్ల రూపాయలుగా ఉన్న ఈ ఖర్చు … ఈసారి 5వేల కోట్లకు చేరనుందని అంచనా. అభ్యర్థులు, పార్టీ కార్యకర్తల తరలింపునకు ఉపయోగించే హెలికాప్టర్లు, బస్సులు, ఇతర రవాణా ఖర్చు తడిసిమోపెడు కానున్నట్లు సీఎంఎస్ పేర్కొంది. డమ్మీ అభ్యర్థుల వల్ల ఎన్నికల ఖర్చు పెరిగే అవకాశం ఉంది.

ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘానికి భారీ స్థాయిలో ఖర్చు కానుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి అత్యధికంగా ఎన్నికల సంఘానికి 262 కోట్ల రూపాయిలు బడ్జెట్ కేటాయించారు. హిమాలయాల్లో సముద్ర మట్టానికి 15 వేల అడుగుల ఎత్తయిన ప్రదేశంలో ఉన్న పోలింగ్ బూత్‌లతోపాటు, పశ్చిమ భారతంలోని దట్టమైన అడవుల్లో నివసిస్తున్న ఏకైక సన్యాసి కోసం కూడా ఈసీ ప్రత్యేకంగా పోలింగ్ బూత్ ఏర్పాటుచేయనుంది. ఎన్నికల ప్రకటనల ఖర్చు 2600 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని జెనిత్ ఇండియా అనే సంస్థ అంచనా వేసింది. దినపత్రికలు, టెలివిజన్ చానళ్లలో స్లాట్లను ఈ సంస్థ ఏర్పాటు చేస్తుంది. 2014లో రెండు ప్రధాన పార్టీలు ఖర్చు చేసిన 1200 కోట్ల రూపాయలకు ఇది రెట్టింపు కంటే అధికం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *