సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రానా లేటెస్ట్ లుక్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రానా లేటెస్ట్ లుక్

సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ… బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న రానా దగ్గుబాటి, లేటెస్ట్ మూవీ నుంచి ఒక ఫోటో లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫోటో చూసిన వాళ్లందరూ ఆశ్చర్యపోతున్నారు… మరి లీక్ అయిన ఆ ఫోటో ఏ సినిమా లోనిది… అందరినీ ఆశ్చర్యపరిచే రేంజులో ఆ మూవీలో ఏముందో చూడండి.

దగ్గుబాటి రానా సినీ రంగానికి ఇపుడు చాలా కావాల్సిన మెటీరియల్. తానేంటో పూర్తిగా తెలుసుకుని ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా అన్ని రకాల పాత్రలను చేయడం ద్వారా వర్సటైల్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. రానా ఏ రకమైన పాత్రలైనా చేస్తాడని తేలడంతో రానా ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ నటుడయ్యాడు. సౌత్ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న రానా, కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి హీరో అన్న ఇమేజ్‌లో ఫిక్స్‌ అవ్వకుండా విలన్‌, క్యారెక్టర్‌ రోల్స్‌ కూడా చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రానా చేస్తున్న మల్టిలింగ్వల్ సినిమా హాథీమేరి సాథీ.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి లీక్ అయ్యి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పిక్‌లో రానా బాగా పెరిగిన గెడ్డంతో వయసైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు రానా పూర్తిగాఓ అడవి మనిషిలా కనిపిస్తున్నాడు. ఒక సినిమా కోసం ఇంత డెడికేటెడ్ గా ఉన్న రానాని చూసిన నెటిజెన్స్, సినీ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతూ దగ్గుబాటి వారసుడిపై కాంప్లిమెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *