పగలు నైటీ ధరిస్తే...రెండు వేలు జరిమానా!

పగలు నైటీ ధరిస్తే...రెండు వేలు జరిమానా!

పశ్చిమగోదావరి జిల్లా తోకలపల్లి గ్రామం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఊరిలో నైటీల నిషేదం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. 

నైటీలు ధరించి రోడ్లపైకి వస్తే.. రెండు వేలు జరిమానా, చూసినవారు చెబితే వెయ్యి బహుమతి అని ప్రకటించారు. నిబంధనలు అతిక్రమిస్తే గ్రామం నుంచి వెలివేయడం జరుగుతుందని గ్రామ పెద్దల కమిటీ నిర్ణయించింది. 

Nighties Ban in AP

నిర్ణయం మంచిదే…

తోకలపల్లిలో ఏ కార్యక్రమం జరిగినా మహిళలు నైటీలతో రావడం ఎక్కువగా పెరిగింది. వీటిపై తోటి మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో చిన్నపాటి గొడవలు జరిగేవి. 20 నుంచి 35 ఏళ్ల మహిళలు నైటీలతోనే తమ పిల్లలను స్కూల్లో దింపటం, పాఠశాల బస్సులు ఎక్కించటం, కిరాణా దుకాణాలకు వెళ్లడం, ఎస్‌ఎంసీ, పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశాలు, డ్వాక్రా సమావేశాల్లో పాల్గొనటంతో పెద్దల్లో ఊరి ఆచారాలు, కట్టుబాట్లపై ఆందోళన నెలకొంది. పగటిపూట నైటీలతో సంచ రించడం వల్ల కుటుంబాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. 

పెద్దల నిర్ణయమే ఫైనల్‌

ఈ నేపథ్యంలో ఏడు నెలల క్రితం మహిళలంతా గ్రామ పెద్దలతో కలిసి దీనిపై చర్చించి, ఒక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఉదయం ఆరు నుంచి రాత్రి ఏడు గంటల వరకూ నైటీలతో సంచరించరాదని నిషేధం విధించారు. మైకుల్లో ప్రచారం చేశారు. అతిక్రమిస్తే జరిమానాకు సిద్ధమవ్వాలని హెచ్చరించారు. అయితే కట్టుబాట్ల పేరుతో మహిళల స్వేచ్ఛను హరించటం ఏమిటని మరో వర్గం వాదిస్తోంది. పలువురు మహిళలు స్వచ్ఛందంగా గ్రామపెద్దల నిర్ణయాన్ని పాటిస్తున్నారు. 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *