400 ఏళ్లగా అనంతపురం జిల్లాలో...ఆరోజు ఊరంతా ఖాళీ అవుతోంది

400 ఏళ్లగా అనంతపురం జిల్లాలో...ఆరోజు ఊరంతా ఖాళీ అవుతోంది

కొన్నికొన్ని విషయాలు భలే అనిపిస్తాయి. వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. ఆ కథల చుట్టూ మనల్ని తిప్పుకుంటాయి. అలాంటివి మన చుట్టుపక్కలే బోలెడుంటాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారిచెరువు గ్రామంలో ఇలాంటి ఇంట్రస్టింగ్‌ విషయం ఒకటుంది. 400 ఏళ్లగా దాన్ని పాటిస్తూనే ఉన్నారు. ప్రతిఏడూ ఆరోజున ఊరంతా ఖాళీ అయిపోతుంది. వినడానికే భలే వింగతా ఉంది కదా… దీనిపై ఓ లుక్కేద్దాం పదండి.

అదీ కథ…

పౌర్ణమిని హిందువులు శుభసూచికగా పరిగనిస్తారు. మాఘ పౌర్ణమిని అన్ని పౌర్ణమిల్లోనూ విశిష్ఠమైనదిగా భావిస్తుంటారు. మాఘస్నానానికీ ఎన్నో ప్రయోజనాలున్నాయని చెప్తారు. దీని ద్వారా శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం ఉంది. మాఘపౌర్ణమి రోజున దేవతలు తమ శక్తులన్నింటినీ జలాల్లో ఉంచుతారని నమ్ముతారు. దీంతో కోనేటి స్నానం, నదీ స్నానం ద్వారా ప్రయోజనాలు కలుగుతాయని చెప్తారు. మాఘపౌర్ణమిని దేశమంతటా అన్ని ప్రాంతాల్లోనూ జరుపుకుంటారు. తలారిచెరువు గ్రామస్తులకు మాత్రం దీన్ని చాలా చాలా స్పెషల్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు.

అలా జరుపుకుంటారు… 

మాఘ పౌర్ణమి రోజున ఈ గ్రామస్తులంతా ఇళ్లను ఖాళీ చేసి పొలిమేరలోని హాజివలి దర్గాకు వెళ్లిపోతారు. సూర్యోదయానికి ముందుగానే ఇళ్లకు తాళాలు వేసి పశువులతో సహా అక్కడికి చేరుకుంటారు. కులమతాలకు అతీతంగా 400 ఏళ్లగా మాఘపౌర్ణమి రోజున ఈ పద్ధతిని ఫాలో అవుతూనే ఉన్నారు. ఆ రోజు అక్కడే సామూహిక వంటశాలను నిర్వహిస్తారు. ఏ బేధాలూ లేకుండా అందరూ హాయిగా భోంచేస్తారు. పిల్లలంతా ఒక దగ్గర చేరి ఆడుకుంటారు. రాత్రి 12 గంటల వరకూ ఊరంతా దర్గా దగ్గరే ఉంటుంది. రోజు మారిన తర్వాతే ఇళ్లకు చేరుకుంటారు. ఊరు చేరుకున్న తర్వాత ప్రతిఒక్కరూ తమ ఇంట్లోకి వెళ్లేముందు గడపకు కొబ్బరికాయ కొడతారు. ఆ తర్వాతే ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. దీని వల్ల గ్రామానికి మంచి జరగుతుందనీ, దేవతలు గ్రామాన్నీ కాపాడుతారనీ విశ్వసిస్తారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *