ముగిసిన రెండో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్

ముగిసిన రెండో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్

లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. కర్నాటక, పశ్చిమబెంగాల్‌లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 65 శాతం వరకు పోలింగ్ జరిగింది. కర్నాటకలో 63 శాతం వరకు, పశ్చిమబెంగాల్‌లో 70 శాతం దాకా పోలింగ్ నమోదైంది.

దేశవ్యాప్తంగా రెండో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 11 రాష్ట్రాల్లో 95 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటితోపాటు ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా జరిగిన పోలింగ్‌. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌, 5 గంటల వరకు కొనసాగింది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్‌ ముగిసింది. క్యూలో ఉన్న ఓటర్లకు ఈసీ ఓటు వేసే అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా జరిగిన రెండు విడత ఎన్నికల్లో 61.12 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ తెలిపింది. పలువురు రాజకీయ ప్రముఖులు రెండో దశ ఓటింగ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ విడతలో మొత్తం 1,600 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 15.8 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 61.12 శాతం పోలింగ్ నమోదు అయింది.

new voters in elections 2019

మరోవైపు కర్ణాటకలోని మాండ్య, పశ్చిమ బెంగాల్‌, మిజోరంలలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నా… మిగతా అన్నిచోట్లా ప్రశాంతంగా సాగింది. తమిళనాడు, యూపీలోని మథురలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో సాయంత్రం 5గంటలకే పోలింగ్ ముగిసింది. మథురలో రాత్రి 8గంటల వరకు పోలింగ్‌ జరగింది. పోలింగ్‌ ముగిసే సమయానికి పోలింగ్‌ శాతం 61.12గా నమోదైనట్లు ఈసీ తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 76.07 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యల్పంగా జమ్ముకశ్మీర్‌లో 43.37 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఇటు జమ్ముకశ్మీర్ లో కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉధమ్ పూర్ లో ఓటింగ్ శాతం 66.67 కాగా. అస్సామ్ లో 73.32 శాతం ఓట్లు పోలయ్యాయి. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ శాతం 76.07. మణిపూర్ లో ఓటింగ్ శాతం 74.3. పోలింగ్‌ నమోదైంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *