తెలుగు రాష్ట్రాల అధినేతల మద్దతు ఎవరికి..?

తెలుగు రాష్ట్రాల అధినేతల మద్దతు ఎవరికి..?

జాతీయ రాజ‌కీయాల్లో కొత్త స‌మీక‌ర‌ణాలు తెర మీద‌కు వ‌స్తున్నాయి…తెలుగు పార్టీల మ‌ద్దతు కీల‌కం కానుందా… తెలంగాణ‌లో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీతో జాతీయ పార్టీల నేత‌లు సంప్రదింపులు జ‌రుపుతున్నారా…? టీడీపీ అధినేత చంద్రబాబు రూటు ఎటువైపు…ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల అధినేతలు ఎవరికి మద్దతు తెలిపేందుకు సిద్దంగా ఉన్నారు..

టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ అధినేత‌ రాహుల్‌కు మ‌ద్దతు ఇస్తూ..మోదీ వ్యతిరేక శక్తులను ఏకం చెసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వివిద రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు…వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా మోదీని గద్దె దింపాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుత స‌ర్వేల ఆధారంగా వస్తున్న అంచనాల ప్రకారం ఏ పార్టీకీ సంపుర్ణ మెజార్టీ రాదని తెలుస్తోంది… దాంతో ముందే తేరుకున్న జాతీయ పార్టీల నేతలు తమకున్న పాత పరిచయాలతో టీఆర్‌ఎస్, వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తమతో కలిసి రావాలని ఇరు పార్టీల నేతలను కోరుతున్నారు.

టీఆర్ఎస్ ,వైసీపీల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు కొంద‌రు జాతీయ నేత‌లు రంగంలోకి దిగారు…అయితే ఈ రెండు పార్టీల నుంచి వ‌చ్చిన స‌మాధానంతో వారు కంగు తింటున్నారు…చంద్రబాబు ఉంటే తాము కూట‌మిలో చేర‌లేమ‌ని..క‌నీసం మ‌ద్దతు కూడా ఇవ్వలేమ‌ని టీఆర్‌ఎస్ ,వైసీపీ నేత‌లు స్పష్టం చేసిన‌ట్లు విశ్వసనీయంగా తెలిసింది. మీ కూట‌మికి టీడీపీ కావాలా లేక మా రెండు పార్టీలు కావాలో తేల్చుకోవాల‌ని ఒక విధంగా అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం.

ఫ‌లితాలు రాక ముందే టీఆర్‌ఎస్‌, వైసీపీ నేతలు మేము కావాలో టీడీపీ కావాలో తేల్చుకొవాలని అల్టిమేటం ఇవ్వడంతో.. ఫలితాల తరువాతే సంప్రదించడం మంచిదని జాతీయనేతలు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఎవరికి మెజార్టీ వస్తుందో తెలియక అయోమయానికి గురవుతున్న జాతీయ పార్టీల నేతలు – టీఆర్‌ఎస్‌, వైసీపీ నేతలు ఇచ్చిన ఝలక్‌తో ఆ రెండు పార్టీలను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *