ఇన్సురెన్స్‌ డబ్బుల కోసం చేతిని నరుక్కుంది

ఇన్సురెన్స్‌ డబ్బుల కోసం చేతిని నరుక్కుంది

కొన్నికొన్ని విషయాలు షాక్‌కు గురిచేస్తాయి. ఇలా కూడా ప్రవర్తిస్తారా… అనే ఆలోచనను కలిగిస్తాయి. అలాంటి వార్తలు మనకి డైలీ లైఫ్‌లో బోలెడన్ని కనిపిస్తాయి. కానీ ఇది మరికాస్త డిఫ్రంట్‌గా అనిపించే సంఘటన. ఇన్సురెన్స్‌ కోసం చేసిన లొసుగులతో దొరికిపోయిన ఎంతోమందిని మనం చూసుంటాం. కానీ ఇలాంటి వ్యక్తులూ, సంఘటనలూ మాత్రం అరుదుగా కనిపిస్తాయి. పట్టుమని రెండుపదుల వయసులేని అమ్మాయి ఇన్సురెన్స్‌ డబ్బుల కోసం ప్రాణాలనూ, సొంత దేహాన్నీ లక్ష్యపెట్టలేదు. అంతచేసీ చివరికి కటకటాలపాలైంది. ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యులూ అరెస్టయ్యారు. మోసం చేయబోయి ఎలా చిక్కుల్లో ఇరుక్కుంటారో ఈ సంఘటన ద్వారా మరోసారి నిరూపితమైంది. దీనిపై ఓ లుక్కేద్దాం పదండి.

చేతిని నరుక్కుంది….

అది స్లోవేనియాలోని లియూబ్లియనా ప్రాంతం. ఒక 21 ఏళ్ల యువతి… ఇన్సురెన్స్‌ డబ్బు కోసం రంపంతో తన చేతిని తానే నరుక్కుంది. చెట్టు కొమ్మలను నరుకుతుండగా గాయమైందని అబద్ధం చెప్పి ఆస్పత్రిలో చేరింది. ఈ తతంగమంతటికీ ఆమె కుటుంబసభ్యులూ తోడు నిలిచారు. అనుమానం వచ్చిన ఆస్పత్రి సిబ్బంది… ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. తొలిదశ విచారణలోనే అది ప్రమాదం కాదని పోలీసులకు అర్ధమైపోయింది. నేరుగా ఆ యువతి ఇంటికి వెళ్లి సోదా చేయగా… తెగిపడ్డ చెయ్యి అక్కడే ఉంది. ఒక్కసారిగా షాక్‌ అయిన పోలీసులు ఆ చేతిని తీసుకుని హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని డాక్టర్లకు అప్పగించారు. సమయం మించిపోకపోవడంతో ఆపరేషన్‌ చేసి తిరగి ఆమె చేతిని అమర్చారు. తమని మోసం చేసినందుకు భీమా సంస్ధ ఈ కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసింది. ఈ యువతి పేరు మీద 3.14 కోట్ల రూపాయలకు భీమా ఉందని ఆ సంస్థ వెళ్లడించింది. ఈ మధ్య ఇటువంటి చీటింగ్‌ కేసులు ఎక్కువ అవ్వడంతో ఆ సంస్థ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఆ యువతితో పాటు కుటుంబ సభ్యులందరికీ 8 ఏళ్లకు పైగా శిక్షపడే అవకాశం ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *