జమ్ముకశ్మీర్‌లో అలజడి...

జమ్ముకశ్మీర్‌లో అలజడి...

జమ్ముకశ్మీర్‌లో ఆందోళనకారులు మళ్లీ రెచ్చిపోయారు. పాకిస్థాన్‌, ఐఎస్‌ఐఎస్‌ జెండాలు పట్టుకుని వీధుల్లో హడావుడి చేశారు. బక్రీద్‌ని టార్గెట్‌ గా చేసుకొని శ్రీనగర్‌లో రోడ్లపైకి వచ్చి పెద్దఎత్తున నినాదాలు చేస్తూ అలజడి రేపారు. ఈద్‌ ప్రార్థనల తరువాత శాంతికి భంగం కలిగించేలా భద్రతా బలగాలపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.

Terrorists shot dead a police personnel in Kulgam

పోలీసుఫై తుపాకీతో దాడి

ఇదిలా ఉంటే ఉదయం కుల్గాంలోని జాజ్రీపొరా ప్రాంతంలో ఈద్గా వెలుపల ఒక పోలీసుని ఉగ్రవాదులు తుపాకులతో కాల్చి చంపారు.తరచూ ఇలాంటి చర్యలతో జమ్ముకాశ్మీర్‌ లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆందోళనాకారుల రాళ్ల దాడిలో తమిళనాడుకి చెందిన పర్యాటకుడు చనిపోయారు. అలాగే షోపియాన్‌లోని జవూరా గ్రామంలో ఓ పాఠశాల బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వి భయానక వాతావరణం సృష్టించారు. తరుచూ రాళ్లు రువ్వుతూ, ఐఎస్‌ఐఎస్‌ జెండాలు ప్రదర్శిస్తూ ఆందోళనకారులు నిరసనలు తెలుపుతుండడం భద్రతా బలగాలకు తలనొప్పిగా మారుతోంది. వారి తీరును తాము ఖండిస్తున్నట్లు ఇటీవలే రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేశారు. జమ్ముకశ్మీర్‌లో పర్యాటకులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత భద్రతా బలగాలకు ఉంటుందని, అందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *