తెలుగులో విడుదల అవుతున్న విశాల్ “టెంపర్”

తెలుగులో విడుదల అవుతున్న విశాల్ “టెంపర్”

పూరి జగన్నాథ్‌, ఎన్టీఆర్ కంబినేషన్లో వచ్చిన “టెంపర్‌” మంచివిజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో సక్సస్ కొట్టిన టెంపర్ ని విశాల్ తమిళ్లో “అయోగ్య” పేరుతో రీమేక్ చేశాడు. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రాబట్టిన అయోగ్య, మంచి వసూళ్లు రాబడుతూ, విశాల్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలుస్తోంది. పోలీస్ ఆఫీసర్‌గా విశాల్ తన విశ్వరూపం చూపించాడంటూ కోలీవుడ్ సినీ అభిమానులతో పాటు, క్రిటిక్స్ కూడా అయోగ్యకి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

కోలీవుడ్ లో అయోగ్య మంచి టాక్ రాబట్టడంతో, ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. అయోగ్యలో చిత్రం చివరి గంటలో వచ్చే సీన్స్ అన్నింటిని పూర్తిగా మార్చేయడంతో, టెంపర్ కి అయోగ్యకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఈ సినిమా తెలుగులో కూడా ఆడుతుందని నమ్మకంతో మేకర్స్ ఈ మూవీని జూన్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒక దగ్గర హిట్ అయిన సినిమా, కొద్దిగా మార్పులు చేసినంత మాత్రం ఆడియన్స్ ఆ మూవీ యాక్సెప్ట్ చేస్తారా అంటే కష్టమనే చెప్పాలి. పైగా టెంపర్ లో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్నే చూపించాడు. తారక్ ని మరిపించేలా విశాల మెప్పించగలడా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *