ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌: హాబ్స్‌ అండ్‌ షా తెలుగు ట్రైలర్

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌: హాబ్స్‌ అండ్‌ షా తెలుగు ట్రైలర్

భారీ యాక్షన్ చిత్రం “ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌”. ఈ సినిమా సిరీస్‌ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఈ సిరీస్‌ నుంచి ఎనిమిది చిత్రాలు వచ్చి భారీ కలెక్షన్లను కొల్లగొట్టాయి.. ఇప్పుడు తొమ్మిదో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.డేవిడ్‌ లిచ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సిరీస్ కు “ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌: హాబ్స్‌ అండ్‌ షా” టైటిల్‌ను ఖరారు చేశారు. స్ట్రీట్‌ రేసింగ్‌ నేపథ్యంతో యాక్షన్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ ఆగస్టు 2న విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్..

“ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌” సిరీస్‌ నుంచి వచ్చిన ఎనిమిది చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు బిలియన్‌ డాలర్ల కలెక్షన్లు రాబట్టాయి. ఈ సినిమాను ఇండియాలో పది భాషల్లో విడుదల చేయబోతుంది యూనివర్సల్‌ పిక్చర్స్‌ ఇండియా సంస్థ. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి భారీ అంచనాలతో రాబోతున్న ఈ తొమ్మిదో సిరీస్ వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *