సెల్ఫీ దారుణం : గోవా బీచ్‌లో తెలుగమ్మాయి మృత్యువాత

సెల్ఫీ దారుణం : గోవా బీచ్‌లో  తెలుగమ్మాయి మృత్యువాత

సెల్ఫీల కోసం యువతరం పడే తాపత్రయం ప్రాణాల మీదకు తెస్తోంది. గోవా బీచ్‌లో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఓ తెలుగమ్మాయి ప్రమాదానికి గురైంది. అలల్లో కొట్టుకొని పోయి మృత్యువాతపడింది. మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సెల్ఫీ మోజు మరో ప్రాణం తీసింది. గోవా బీచ్‌లో ఓ తెలుగమ్మాయి ప్రమాదవశాత్తు మృత్యువాతపడింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన రమ్యకృష్ణ వృత్తిరీత్యా డాక్టర్. ఇటీవలే ఆమె గోవాలో ప్రభుత్వ అనుబంధ వైద్యసంస్థలో చేరింది. మంగళవారం సాయంత్రం సరదాగా బీచ్ కు వెళ్లిన రమ్య కృష్ణ.. ఓ సెల్ఫీ తీసుకుందామని సముద్రంలోకి వెళ్లింది. సెల్ఫీ సందడిలో సరిగ్గా చూసుకోకపోవడంతో.. అలల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు వెంట వచ్చిన మరో వైద్యురాలు కూడా నీళ్లలో పడిపోయింది. అయితే స్థానికులు ఆమెను కాపాడగలిగారు.

రమ్యకృష్ణకు తల్లి, సోదరులు, సోదరి ఉన్నారు. గతేడాది వరకు ముఖ్యమంత్రి వైద్య కేంద్రంలో డాక్టర్‌గా పనిచేసిన రమ్యకృష్ణ.. 2018లో గోవాలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లింది.పట్టణంలో సుపరిచితురాలైన రమ్యకృష్ణ మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. రమ్యకృష్ణ మృతదేహం ఇవాళ జగ్గయ్యపేటకు చేరుకోనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *