జీవితాన్ని తలకిందుల చేసిన కొబ్బరి కాయ

జీవితాన్ని తలకిందుల చేసిన కొబ్బరి కాయ

ఒక కొబ్బరికాయ ఒక ఎమ్మెల్యే జీవితాన్ని తలకిందులు చేసింది. నియోజకవర్గంలో అధికారమంత తమ చేతుల్లో పెట్టుకొని ఒక వెలుగు వెలిగిన చొప్పదొండి ఎమ్మెల్యే బొడిగే శోభ కొబ్బరికాయ కారణంగా మాజీ కావాల్సి వచ్చింది. 2014లో చొప్పదొండి నుంచి ఎస్పీ రిజర్వేషన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా శోభ గెలిచారు. జనాభా పరంగా, రాజకీయంగా అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ఎదురులేదు. అయితే శోభా ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రెడ్డి నాయకులను, ప్రజలను పక్కన పెడుతూ వచ్చారు.

పదవిని తీసిన కొబ్బరికాయ

తాజాగా జరిగిన ఎన్నికల ముందకు నియోజక వర్గంలో అగ్ని మాపక కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ఆర్ధిక శాఖా మంత్రి ఈటెల రాజెందర్‌తో పాటు ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే లక్ష్మణ్, శోభ హాజరైయ్యారు. అయితే ఎంపీ వినోద్ కుమార్ అక్కడకు వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త చొక్కా రెడ్డి చేతికి కొబ్బరి కాయ ఇచ్చి కొట్టమన్నారు. దీంతో చొక్కారెడ్డి అంటే గిట్టని శోభ కొబ్బరి కాయ కొట్టడానికి నువ్వువ్వెరు అంటూ అందిరిలో అడ్డుకున్నారు. మంత్రి ఈటెల, ఎంపీ వినోద్ జోక్యంతో సమస్య అక్కడ సద్దుమనిగింది.

telangana sobha

అయితే ఆ ఎపిసోడ్ శోభాకు ఎన్నికల సమయంలో ఎఫెక్ట్ అయింది. ఆమె తీరుతో ఆగ్రహంగా ఉన్న పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వటానికి నిరాకరించింది. రెండు నెలల పాటు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేసినా…. అధినేత అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో బీజేసీ తరుపున ఎన్నికల బరిలో దిగిన శోభా ..టీఆర్ఎస్‌ అభ్యర్ధి సుంకే రవిశంకర్ చేతిలో ఘోర పరాజయం మూట కట్టుకున్నారు. గెలిచిన అనంతరం రవిశంకర్ కొండగట్టుకు వెళ్లి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే అదే పూజలకు చొక్కా రెడ్డి కూడా ఒక న్యూస్ పేపర్లో ఒక కొబ్బరికాయ తీసి ఇది ఆ కొబ్బరి కాయ అంటూ ఆనందంగా మొక్కు చెల్లించారు.

ఏదిఏమైనా ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన వారు ఒక కొబ్బరికాయ శోభా కొంప ముంచిందరని చెవులు కొరుక్కొంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *