ఈసీ చెప్పిన అరగంటకే రేవంత్ విడుదల

ఈసీ చెప్పిన అరగంటకే రేవంత్ విడుదల

మంగళవారం తెల్లవారుజామున రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై స్పందినించిన రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్ కుమార్…రేవంత్ విడుదల చేయాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. కోస్గిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగసభ ఉన్నందున రేవంత్ నిరసనలకు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రేవంత్‌ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అరెస్ట్ కార్యక్రమం రాజకీయంగా పెద్ద దుమారం లేపింది. రేవంత్ నిద్రపోతున్న సమయంలో తలుపులు పగలగొట్టి బలవంతంగా రేవంత్‌ని లాక్కెళ్లారు. రేవంత్ అరెస్ట్‌ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ వర్గాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. అభిమానులు కొందరు ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ప్రయత్నించడంతో అధికారులు వెంటనే రేవంత్‌ని విడుదల చేయాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు.

ఈ క్రమంలోనే రేవంత్ ఆచూకీ చెప్పాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం పోలీసులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కడో ఉన్నారో వివరాలు ఇవ్వమని వికారాబాద్ ఎస్పీకి ఆదేశించింది.

రేవంత్ రెడ్డి అరెస్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రేవంత్‌ను అక్రమంగా తెల్లవారుజామున మూడు గంటలకు అరెస్ట్ చేశారని, ఎందుకు చేశారో చెప్పలేదని తెలిపారు. దీంతో ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికారి వెంటనే మీడియా సమావేశం పెట్టి రేవంత్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. అయితే, ఎన్నికల ముఖ్య అధికారి చెప్పిన అరగంటకే రేవంత్‌ను పోలీసులు విడుదల చేయడం విశేషం.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *