అటవీ రేంజ్ ఆఫీసర్ అనితను ప‌రామ‌ర్శించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

అటవీ రేంజ్ ఆఫీసర్ అనితను ప‌రామ‌ర్శించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

పోడు భూముల స‌మ‌స్య ప‌రిష్కారానికి త‌మ ప్ర‌భుత్వం చిత్త శుద్దితో ప‌ని చేస్తుంద‌ని, త్వ‌ర‌లోనే సీయం కేసీఆర్ ఈ స‌మ‌స్య‌ను పరిష్కరిస్తారని అటవీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. బోథ్ మండ‌లం కోర్టా (కే) గ్రామంలో అటవీ రేంజ్ ఆఫీసర్ అనితను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. అనిత ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం అన్నివిధాలా అండ‌గా ఉంటుంద‌ని, అధైర్య‌ప‌డ‌వ‌ద్ద‌ని అనిత‌కు, ఆమె కుటుంబ స‌భ్యుల‌కు చెప్పారు. కాగ‌జ్ న‌గ‌ర్ అటవీ రేంజ్ ఆఫీసర్ అనితపై దాడి చేసిన వారిని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని, ఈ కేసులోద‌ర్యాప్తు కొన‌సాగుతుంద‌ని అట‌వీ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *