స్వల్ప ఓట్లతో ఓడిపోయిన బీజేపీ నేత కిషన్‌రెడ్డి

స్వల్ప ఓట్లతో ఓడిపోయిన బీజేపీ నేత కిషన్‌రెడ్డి

తెలంగాణ ఎన్నికలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అందరినీ చిత్తు చిత్తుగా ఓడించాడు. కనీసం కారు దరిదాపుల్లో ఎవరినీ లేకుండా కేసీఆర్ వ్యూహం పన్నాడు. ప్రజల మీద నమ్మకంతో, తన సంక్షేమ కార్యక్రమాల మీద నమ్మకంతో వెళ్లిన కేసీఆర్‌కు ప్రజలు కూడా స్పష్టమైన మెజారిటీతో గెలిపించారు.

kishan reddy loss

స్వల్ప మెజారిటీతో పరాజయం

ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇతర పార్టీల నాయకులకు చీకటిరోజుగా మిగిల్చింది. చాలా సీనియరిటీ ఉన్న నాయకులే కారు ముందు బేజారయ్యే స్థితికి తెచ్చారు. ఇప్పటికే జానారెడ్డి, రేవంత్ రెడ్డి లాంటి నాయకులు ఓడిపోగా..ఇపుడు బీజేపీ సీనియర్ నాయకుడు, అంబర్‌పేట అభ్యర్థి కిషన్‌రెడ్డి కూడా టీఆర్ఎస్ చేతిలో ఓటమి పాలయ్యాడు. టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ చేతిలో కేవలం 1016 ఓట్ల స్వల్ప మెజారిటీతో పరాజయం మూటగట్టుకున్నాడు. 2004 నుంచి వరుసగా విజయం సాధించిన కిషన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ బ్రేక్ వేసింది. గతంలో 2004 లో హిమాయత్‌నగర్ స్థానం నుంచి, 2009, 2014 ఎన్నికల్లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి కిషన్‌రెడ్డి విజయం సాధించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *