మరికొద్ది నిమిషాల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

మరికొద్ది నిమిషాల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

రాష్ట్రంలోని 31 జిల్లాల్లో మొత్తం 44 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు. ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌, త్రివిధ దళాల్లో పనిచేస్తున్నవారి ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభింస్తారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందికి ఇప్పటికే రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చారు.

ts results 2018

ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ షురూ

ఇప్పటికే కౌంటింగ్‌ కేంద్రాలను ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు 100 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు విధించారు. సీసీ టీవీల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది. లెక్కంపు కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ అనుమతించేది లేదని అధికారులు స్పష్టంచేశారు. భద్రతపై విపక్షాలు అనుమానాలు లేవనెత్తిన దృష్ట్యా స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల పోలీసు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశామని లా అండ్ ఆర్డర్ అడిషనల్‌ డీజీ జితేందర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులతో పర్యవేక్షిస్తామని తెలిపారు.

మరికొద్ది గంటల్లో తేలనున్న భవితవ్యం

ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలూ తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో దిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పాల్గొని పలు సూచనలు చేశారు. లెక్కిపు ప్రక్రియ సవ్యంగా సాగితే… తక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న భద్రాచలం నియోజక వర్గ ఫలితాలు తొలుత వెలువడే అవకాశం ఉంది. అలాగే అత్యధిక పోలింగ్‌ కేంద్రాలున్న శేరిలింగంపల్లి ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది.

లెక్కింపు ప్రక్రియంతా రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో కొనసాగుతుంది. ప్రతి టేబుల్‌ వద్ద కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌, మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. మొత్తంగా 2,379 రౌండ్లలో లెక్కింపు కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. ప్రతి రౌండ్‌లో 14వేల ఓట్ల వరకు ఫలితాలు వస్తాయని తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *